లక్ష్యాన్ని ఎంచుకోనివ్వండి!

కొందరు తల్లిదండ్రులు పిల్లల ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తారు. దాంతో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా... తడబడుతూ ఉంటారు. ముఖ్యంగా కెరియర్‌ విషయంలో తమ అభిప్రాయాల్ని చిన్నారులపై రుద్దుతారు.  ఈ తీరు వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందంటారు మానసిక నిపుణులు.

Published : 14 Oct 2021 01:24 IST

కొందరు తల్లిదండ్రులు పిల్లల ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తారు. దాంతో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా... తడబడుతూ ఉంటారు. ముఖ్యంగా కెరియర్‌ విషయంలో తమ అభిప్రాయాల్ని చిన్నారులపై రుద్దుతారు.  ఈ తీరు వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందంటారు మానసిక నిపుణులు.

గౌరవం... చాలా కుటుంబాల్లో చిన్నప్పటి నుంచి పిల్లల అవసరాలన్నీ పెద్దవాళ్లే చూస్తుంటారు. వారిక్కావాల్సిన వస్తువుల నుంచి దుస్తుల వరకు అన్నీ తామే కొంటుంటారు. ఇది కొన్నిసార్లు పిల్లలపై చెడు ప్రభావం చూపిస్తుంది. కొందరు చిన్నారులు సొంతంగా నిర్ణయాలు తీసుకోలేని మనస్తత్వాన్ని అలవరుచుకుంటే, మరికొందరు తమ అభిప్రాయాలను బయటికి చెప్పలేక బాధపడుతూ ఉంటారు. యుక్తవయసు వచ్చేలోపే పిల్లల అభిప్రాయాలు, అభిరుచులను తెలుసుకుని, పెద్దవాళ్లు వాటిని గౌరవించాలి. పిల్లలకు వారి మనసులో మాట చెప్పే స్వేచ్ఛనివ్వాలి. అది వారికి భవిష్యత్తులో చాలా నైపుణ్యాలను నేర్పుతుంది. అలాకాకుండా నీకేం తెలీదు, మేం చెప్పిందే చేయాలని ఒత్తిడి తెస్తే వారు విజయాలను సాధించలేరు. పలురకాల ఒత్తిళ్లకూ గురవుతారు.

అవసరాలు... తల్లిదండ్రులకు పిల్లలెప్పుడూ చిన్నవాళ్లుగానే కనిపిస్తారు. అయితే వారి మానసిక పరిపక్వతను ఎప్పటికప్పుడు గుర్తించగలగాలి. వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ ఉండాలి. ఏ రంగంలో వారికి ఆసక్తి ఉందో తెలుసుకోవాలి. దానికి తగినట్లుగా వారి అవసరాలను తీర్చితే చాలు. దాంతోపాటు వారెంచుకున్న రంగం గురించి అధ్యయనం చేసి వీలైతే మరిన్ని వివరాలను అందిస్తే, లక్ష్యాన్ని చేరుకోవడంలో పిల్లలు దాన్ని ప్రోత్సాహంగా తీసుకుంటారు. మనసుకు నచ్చిన కెరీర్‌ కావడంతో విజయాలను సాధించడానికి ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. చిన్నచిన్న వైఫల్యాలెదురైనా విమర్శించకుండా, ప్రోత్సహించి తిరిగి వారి మార్గంలో నడవడానికి చేయూతగా తల్లిదండ్రులుంటే ఆ పిల్లలు విజేతలుగా నిలుస్తారు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్