అమ్మకు కావాలీ నైపుణ్యాలు

నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి వరకు చిన్నారులు అమ్మతోనే ఎక్కువగా ఉంటారు. వారి అవసరాలను ఎప్పటికప్పుడు తీరుస్తూ.. కుటుంబాన్ని చక్కదిద్దుకుంటుంది మహిళ. ఇలా బోలెడు పాత్రలు పోషించాలన్నా,

Published : 19 Oct 2021 01:57 IST

నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి వరకు చిన్నారులు అమ్మతోనే ఎక్కువగా ఉంటారు. వారి అవసరాలను ఎప్పటికప్పుడు తీరుస్తూ.. కుటుంబాన్ని చక్కదిద్దుకుంటుంది మహిళ. ఇలా బోలెడు పాత్రలు పోషించాలన్నా, పిల్లలను తేలిగ్గా సమన్వయం చేసుకోవాలన్నా కొన్ని నైపుణ్యాలు కావాలంటారు మానసిక నిపుణులు.

సూపర్‌ మదర్‌ కావాలంటే.. మనసెరిగి నడుచుకునే అమ్మే  చిన్నారులకు సూపర్‌ మదర్‌. అందుకే ఎప్పుడూ మీరు ఎనర్జీని కోల్పోకూడదంటే తప్పనిసరిగా పోషకాహారం తీసుకోవడం, వ్యాయామం అలవరుచుకోవాలి. అప్పుడే మీ బాధ్యతల్ని వందశాతం పూర్తి చేయగలరు.

వారికోసమే ఆ సమయం... చిన్నారులతో గడిపే సమయాన్ని వందశాతం వారికోసమే అన్నట్లుగా ఉండేలా జాగ్రత్తపడాలి. ఆఫీస్‌ పని, టీవీ చూస్తూ లేదా ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటే...అమ్మ మనసులో తమకు ప్రాధాన్యం లేదని పొరబడే అవకాశం ఉంది. అది వారిలో ఒత్తిడిని కలిగిస్తుంది. మీపైనా ప్రేమ తగ్గుతుంది. ఆఫీస్‌ లేదా ఇంటిపని వీలైనంత వేగంగా పూర్తిచేసి మిగతా సమయాన్ని పిల్లలకు కేటాయించేలా నైపుణ్యాన్ని సాధిస్తే చాలు. మీ మాట చక్కగా వింటారు.

ఆదర్శంగా ఉండాలి... తల్లిని పిల్లలు రోల్మ్‌ోడల్‌గా తీసుకుంటారు. అందుకే సమయపాలన, క్రమశిక్షణ, ఎవరి పనులు వారు పూర్తిచేయడం, ఇతరులను గౌరవించడం, ప్రేమించడం, చేయూతనందించడం, పుస్తకపఠనం, క్రీడాసక్తి వంటివాటిలో పిల్లలకు మార్గదర్శిగా ఉండాలి. మీరీ నైపుణ్యాలను అలవర్చుకోగలిగితేనే చిన్నారులకూ వాటిని అందించొచ్చు.  

టీచర్‌గా... ప్రపంచంలో చిన్నారులకు బెస్ట్‌ టీచర్‌ అమ్మే. వారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలిగే విజ్ఞానం, సామర్థ్యాలను ఎప్పటికప్పుడు పెంచుకుంటేనే వాటిని పిల్లలకు అందించొచ్చు. ప్రపంచాన్ని వారి ముందుంచాలంటే దానిపై పూర్తి అవగాహన ముందుగా తల్లికి ఉండాల్సిందే. వీటన్నింటిలో ఆసక్తిని పెంచుకోవడమే కాకుండా నైపుణ్యాన్ని తెచ్చుకుంటేనే దాన్ని పిల్లలకు అందించి, వారిని మెరుగ్గా తీర్చిదిద్దొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్