తప్పొప్పులు చెప్పాలి...

‘ఆలస్యం... అమృతం... విషం’ అనే నానుడి తెలుసుకదా! దీన్ని చిన్నారుల విషయంలోనూ పాటించాలి. పెద్దవాళ్లైతే వారే నేర్చుకుంటారులే.. అనే ఆలోచనను పక్కనపెట్టి,

Published : 25 Oct 2021 02:14 IST

‘ఆలస్యం... అమృతం... విషం’ అనే నానుడి తెలుసుకదా! దీన్ని చిన్నారుల విషయంలోనూ పాటించాలి. పెద్దవాళ్లైతే వారే నేర్చుకుంటారులే.. అనే ఆలోచనను పక్కనపెట్టి, చిన్నప్పటి నుంచే వారికి తప్పొప్పులను వివరించి చెప్పాలంటున్నారు మానసిక నిపుణులు.

మర్యాద నేర్పండి...

బుజ్జాయిలు మాటలు నేర్చుకుంటున్నప్పుడే... పదాల ఉచ్ఛరణతోపాటు మాట్లాడే విధానాన్ని కూడా అలవరచాలి. చిన్నాపెద్దా తేడా తెలియజేస్తూ, పెద్దవాళ్ల పట్ల మర్యాదపూర్వకమైన సంభాషణ నేర్పాలి. బాల్యంలో ఈ అభ్యాసం వారిపై మంచి ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు, ఆ వయసులో ఏది చెప్పినా ఇట్టే గ్రహించే శక్తి వారి మెదడుకుంటుంది. ఇది వారిలో సత్ప్రర్తనను నింపుతుంది.

వెనకేసుకురావొద్దు...

పిల్లలంటే ఇష్టం ఉండొచ్చు. అలాగని వారేం చేసినా ఫరవాలేదు అనడం, పెద్దయితే వాళ్లే నేర్చుకుంటారని వెనకేసుకురావడం చేయొద్దు. మీ మాటలతో వారు...తమ ప్రవర్తన సరైనదేననుకుని దాన్నే కొనసాగించే అవకాశం ఉంది. మొదటి నుంచీ తప్పొప్పులను గుర్తిస్తే సరిచేయాలి. తప్పు చేస్తే వారిలో మార్పు తేవడానికి  ప్రయత్నించాలి. అదే వారి బంగారు భవిష్యత్తుకు పునాది అవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్