చిన్ని కోపాలకు పరిష్కారమిదీ!

చిన్నచిన్నవాటికే అలకలు, ఒక్కోసారి విపరీతమైన కోపం.. కొవిడ్‌ తర్వాత పిల్లల్లో ఇలాంటి మార్పులెన్నో. వీళ్ల ధోరణి అమ్మానాన్నలనూ కంగారు పెడుతోంది. ఇందుకు ప్రకృతే పరిష్కారమంటున్నారు నిపుణులు.

Published : 26 Oct 2021 01:35 IST

చిన్నచిన్నవాటికే అలకలు, ఒక్కోసారి విపరీతమైన కోపం.. కొవిడ్‌ తర్వాత పిల్లల్లో ఇలాంటి మార్పులెన్నో. వీళ్ల ధోరణి అమ్మానాన్నలనూ కంగారు పెడుతోంది. ఇందుకు ప్రకృతే పరిష్కారమంటున్నారు నిపుణులు.

లాక్‌డౌన్‌లో పెద్దవాళ్లే కాదు.. పిల్లలూ ఎలక్ట్రానిక్‌ పరికరాలకు అంకితమయ్యారు. బయటికి వెళతారనే భయం, పెరిగిన వీళ్ల గోలని భరించలేకా ఎంతోమంది మొబైళ్ల సాయం తీసుకున్నారు. తర్వాత ఆన్‌లైన్‌ చదువూ వీటికి మరింత దగ్గరయ్యేలా చేసింది. ఫలితమే ఈ మానసిక పరమైన మార్పులని ఓ అధ్యయనం చెబుతోంది.

పల్లెలతో పోలిస్తే సిటీ పిల్లల్లో కోపం, విసుగు వగైరా ఎక్కువగా కనిపించాయి. లోతుగా పరిశోధిస్తే.. నగరాల్లో వాళ్లు ఇంటికే పరిమితమైతే వీళ్లు ప్రకృతిలో తిరిగే అవకాశముండటమే కారణమని తేలింది. కాబట్టి.. పిల్లల్ని ఎక్కువగా బయట ఆడుకునేలా చూడమంటున్నారు నిపుణులు. అలా వీలు కాకపోతే వారితో మొక్కల పెంపకం వంటివి చేయించినా మంచి ఫలితం ఉంటుందట.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్