పిల్లలా మజాకా?!

ఆడవాళ్లకి ఇంటా బయటా పనులన్నిట్నీ చక్కబెట్టుకోవడం ఒక ఎత్తు అయితే పిల్లల పెంపకం ఒక్కటీ ఇంకో ఎత్తు. మనం చెప్పిందల్లా వినేసి, చేయాలని ఆశించిందంతా చేసేసి బుద్ధిమంతుల్లా ఉంటే ఇక లేనిదేముంది?! చిన్నారుల్ని భయపెట్టకుండా,

Updated : 28 Oct 2021 05:50 IST

ఆడవాళ్లకి ఇంటా బయటా పనులన్నిట్నీ చక్కబెట్టుకోవడం ఒక ఎత్తు అయితే పిల్లల పెంపకం ఒక్కటీ ఇంకో ఎత్తు. మనం చెప్పిందల్లా వినేసి, చేయాలని ఆశించిందంతా చేసేసి బుద్ధిమంతుల్లా ఉంటే ఇక లేనిదేముంది?! చిన్నారుల్ని భయపెట్టకుండా, బెంగపడేలా చేయకుండా ఒప్పించడం కొంచెం కష్టమే అయినా ఆ పని ఇష్టంగా చేయాలి. ముఖ్యంగా పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచగలిగితే ఇక వంక పెట్టాల్సిన పని లేకుండా తయారవుతారు. అందుకోసం నిపుణులు చెబుతోన్న కొన్ని సూచనలు...

పిల్లలు చేసిన చిన్న చిన్న పనులకు మనసారా మెచ్చుకోండి. ఆ పొగడ్తలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఇంకా చేయాలనే ఉత్సాహాన్నిస్తాయి.

* తోటి పిల్లలు గొప్పగా ఉన్నారంటూ పోల్చి కోప్పడితే ఉక్రోషమొచ్చి బాగు పడతారనుకోవడం అపోహ. నిజానికి అలా చేస్తే చిన్నారులు కుంగిపోతారు.

* పిల్లలకు ఒక పని ఎలా చేయాలో చెప్పి వదిలేయండి. మరీ అక్షరాలు దిద్దిస్తున్నట్టు చెబితే సొంతంగా చేయగలమనే ధైర్యం లోపిస్తుంది.

* చదువు విషయంలోనో, ప్రాజెక్ట్‌ వర్క్‌ చేయలేకనో, కొత్త స్నేహితులతో కలవలేకనో ఇబ్బంది పడుతుంటే భుజం తట్టి ప్రోత్సహించండి. మీరిచ్చే ధైర్యం, ప్రోత్సాహం వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.

* ఏదైనా పని బాగా చేయలేకపోయినా, మార్కులు తక్కువ వచ్చినా మళ్లీ మళ్లీ నిందించడం లేదా ఎత్తిచూపడం వల్ల ఆత్మస్థైర్యం కొరవడుతుంది. నిర్లక్ష్యం వల్ల వాటిల్లే కష్టనష్టాలను అర్థమయ్యేలా మృదువుగా చెప్పి వదిలేయండి. వాళ్లలో ఆలోచన మొదలవుతుంది.

* వారిలో ఉన్న బలాలు, బలహీనతలేంటో చెప్పండి. మంచి లక్షణాలను ప్రోత్సహించండి. సామర్థ్యం లేని అంశాల్లో ఎలా మెరుగు పరచుకోవాలో చిన్న చిన్న టిప్స్‌ చెప్పండి.

* మీ చిన్నారులు ఎదగాలి, అభివృద్ధి చెందాలి అనుకుంటున్న అంశాలను తిన్నగా చెప్పకుండా కథల రూపంలో లేదా ఎవరివో అనుభవాలు అన్నట్టుగా చెప్పండి. అందువల్ల ప్రయోజనం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్