ఏకాంతం మీదైతే...
close
Updated : 30/10/2021 13:29 IST

ఏకాంతం మీదైతే...

ఈ రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తేనే కానీ... సంసారం గడవని పరిస్థితి. ఈ క్రమంలోనే కొన్ని ఒత్తిళ్లు, మరికొంత యాంత్రికత ఇద్దరికీ అలవడుతుంది. వాటిని అధిగమించి జీవితాన్ని సంతోషమయం చేసుకోవాలంటే జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి.

లుమగలు ఇద్దరూ వారి వారి ఉద్యోగాలు, అక్కడి బాధ్యతలు, ఒత్తిళ్లు, పనితీరును అర్థం చేసుకోవాలి. అలానే వీలైనంత వరకూ ఆఫీసు పనులకు వ్యక్తిగత సమయాన్ని కేటాయించే పద్ధతికి స్వస్తి చెప్పాలి. తప్పనప్పుడు ఆ పని ప్రాధాన్యాన్ని చెప్పాలి. అప్పుడే ఒకరి పట్ల మరొకరికి అభద్రత ఏర్పడకుండా ఉంటుంది.

* పనిలో ఒత్తిళ్లు సహజం. వాటిని భాగస్వామి మీద చూపించకండి. ఇంటా, బయటా ఒత్తిడి పెరిగినప్పుడు ఇద్దరి మధ్య కలతలు వచ్చే అవకాశం ఉంది. అందుకే మీ సమస్యలను పంచుకోండి. వారి సలహానూ తీసుకోండి. అప్పుడు మీకూ ఓదార్పు దొరుకుతుంది. మీ ఇబ్బందిని మీ భాగస్వామీ అర్థం చేసుకోగలుగుతారు.

* రోజంతా ఎంత తీరిక లేకుండా గడిపినా సరే కనీసం ఓ పూట భోజనమైనా ఇద్దరూ కలిసి తినేందుకు కేటాయించుకోండి. ఆ సమయంలో బయట విషయాల కంటే ఇద్దరికీ సంబంధించిన అంశాలను మాత్రమే చర్చించుకోండి. నిజానికి ఎంత చెప్పుకున్నా... ఒక అరగంట కంటే ఎక్కువ అవసరం లేదు కదా! అలానే కనీసం ఆరునెలలకోసారైనా మీ ఇద్దరూ రెండ్రోజులు ఎక్కడికైనా టూర్‌ వేయండి. ఇవన్నీ మీ బంధాన్ని బలపరుస్తాయి. కొత్త ఉత్సాహాన్నీ ఇస్తాయి.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని