మాటే.. మంత్రం!

ఏదైనా పని పూర్తవ్వాలనుకోండి! కొద్ది గంటలు, రోజులు శ్రమపడితే సరిపోతుంది. కానీ బంధం అలాకాదు. ఆ ప్రయాణం సాఫీగా సాగడానికి ఇద్దరూ నిరంతరం కష్టపడాల్సిందే. ఈ కలతలు అప్పుడప్పుడూ ఎదురయ్యే చిన్న అడ్డంకుల్లాంటివి. సరిచేసుకుంటూ ముందుకు సాగాల్సిందే. దానికి ఉపయోగపడే ప్రధాన టూల్‌.. కమ్యూనికేషన్‌! అదేనండీ... మాట్లాడుకోవడం.

Published : 01 Nov 2021 21:30 IST

ఏదైనా పని పూర్తవ్వాలనుకోండి! కొద్ది గంటలు, రోజులు శ్రమపడితే సరిపోతుంది. కానీ బంధం అలాకాదు. ఆ ప్రయాణం సాఫీగా సాగడానికి ఇద్దరూ నిరంతరం కష్టపడాల్సిందే. ఈ కలతలు అప్పుడప్పుడూ ఎదురయ్యే చిన్న అడ్డంకుల్లాంటివి. సరిచేసుకుంటూ ముందుకు సాగాల్సిందే. దానికి ఉపయోగపడే ప్రధాన టూల్‌.. కమ్యూనికేషన్‌! అదేనండీ... మాట్లాడుకోవడం.

తప్పు మీదేననిపించినపుడు.. పోనీ అవతలి వ్యక్తి కోపానికి కారణం మీరే అని తెలిసినపుడు సారీ చెప్పండి. పోనీ చెప్పడం ఇష్టం లేదా.. తీరైనా మార్చండి. ఎంత కోపమున్నా మీ రోజు వారీ పనుల్లో సాయం చేశారనుకోండి. థాంక్స్‌ చెప్పండి. ఏదైనా బాగా చేస్తే మెచ్చుకోండి.

కోపం కంటే బాధ ఇంకా బరువైంది. అరిచేస్తే పోయేది కాదు మనసుకైన గాయం. మీరు చొరవ చూపగానే ఫలితం వెంటనే రాకపోవచ్చు. కాబట్టి, చిన్న టూర్‌ ప్లాన్‌ చేయండి. ఎక్కువ రోజులు కుదర్లేదా.. ఒక రోజైనా అలా బయటకెళ్లిరండి. అవసరాలన్నీ చెప్పకుండానే తీర్చే ప్రయత్నం చేయండి. నాన్‌ వెర్బల్‌ కమ్యూనికేషన్‌ అంటారు కదా! ఇదే అది. ఇద్దరివీ భిన్న నేపథ్యాలు అయ్యుండొచ్చు. కొన్ని పద్ధతులు ఇతరులకు ఇబ్బంది పెట్టేవైనా అలవాటు కొద్దీ మానలేకపోతుండొచ్చు. అలాంటివి మార్చుకునే యత్నం చేయండి. ఇదీ విలువివ్వడం కింద లెక్కే.

ఎన్ని చేసినా.. లాభం లేదనుకోండి. మూడో వ్యక్తి సాయం తీసుకోండి. ఆ వ్యక్తి ఇద్దరికీ సన్నిహితులై ఉండాలి. వాళ్లకి ఫిర్యాదు చేస్తున్నట్టుగానో, మీ ప్రయత్నాలన్నీ ఏకరువు పెట్టినట్టుగానో చెప్పకండి. విషయం చెప్పకుండా ప్రాథమిక అవగాహన ఇవ్వండి. అప్పుడు అవతలి వ్యక్తి కూడా తన మనసును విప్పే వీలుంటుంది. తను చెప్పిన దాన్నిబట్టి మీ వివరణ ఇవ్వండి. ఇద్దరూ చూడని కోణం ఆ మధ్యవర్తికి తప్పక కనిపిస్తుంది. ఇక్కడ ఓపికదీ ప్రధాన పాత్రే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్