దగ్గర చేయండి...

మధుమిత కెరీర్‌లో స్థిరపడింది. మనసుకు నచ్చిన వ్యక్తితో కలిసి ఏడడుగులు నడవాలనుకుంటోంది. అయితే ఆ వ్యక్తి తల్లిదండ్రులకు నచ్చుతాడో లేదో అనే అనుమానం ఆమెను వెంటాడుతోంది. తనవారికి అతడిని ఎలా

Published : 08 Nov 2021 00:37 IST

మధుమిత కెరీర్‌లో స్థిరపడింది. మనసుకు నచ్చిన వ్యక్తితో కలిసి ఏడడుగులు నడవాలనుకుంటోంది. అయితే ఆ వ్యక్తి తల్లిదండ్రులకు నచ్చుతాడో లేదో అనే అనుమానం ఆమెను వెంటాడుతోంది. తనవారికి అతడిని ఎలా దగ్గరచేయాలో తెలియక సతమతమవుతోంది. జీవితాంతం కలిసి ఉండాల్సిన వ్యక్తి తల్లిదండ్రుల మనసులో కూడా స్థానాన్ని సంపాదించగలిగితే వాళ్లు కష్టసుఖాల్లో చేయూతగా నిలుస్తారు అని చెబుతున్నారు మానసిక నిపుణులు.

* ముందుగా

మనసులో ఉన్న వ్యక్తి గురించి ముందుగా ఇంట్లో పెద్దవాళ్లకు చెప్పాలి. వారికి ఈ విషయం నచ్చుతుందో లేదో అనుకుంటూ దాచిపెట్టకూడదు. వారి అభిప్రాయాన్ని తెలుసుకోవాలి. ఏయే గుణాలు అతడిలో నచ్చాయో వాటినీ వివరించడం మర్చిపోకూడదు. తల్లిదండ్రుల మనసులో అతడిపై సదభిప్రాయం లేకపోయినా ప్రశాంతంగా వారితో మాట్లాడాలి. కారణాలు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. పెద్దవాళ్ల మనసులోని భయాలను తెలుసుకుని వాటిని దూరం చేయగలగాలి.

* తగినవాడుగా..

పాతికేళ్లపాటు పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులకు పూర్తిగా పిల్లల మనసు, వారి తీరు తెలుస్తుంది. వాటికి తగినవాడు వస్తాడో లేదో అనే అనుమానం పెద్దవాళ్లలో ఉండటం సహజం. తమ పిల్లలకు సరిపోయే వ్యక్తిని వెతికిమరీ వివాహం చేయాలనుకుంటారు. అటువంటి తమ అభిప్రాయానికి వ్యతిరేకంగా ఇష్టమైన వ్యక్తిని ఎంచుకున్నందుకు కొంత కోపం కూడా ఉండొచ్చు. ఈ కోణంలో ఆలోచించి, వారి అభిప్రాయానికి విలువనిస్తూనే, ఫలానా వ్యక్తిని ఎందుకు ఇష్టపడ్డారో వివరించి చెప్పాలి. అతడు మీకు ఎలా తగినవాడుగా అనిపించాడో వివరించాలి.

* దగ్గరచేయడానికి

ఆ వ్యక్తితో మీ జీవితం సంతోషంగా ఉంటుందనే భరోసా, నమ్మకం వారికి కలగాలి. మనసుకు నచ్చిన వాడిని తల్లిదండ్రులకు దగ్గరచేసే ప్రయత్నాన్ని మాత్రం మానకూడదు. చిన్నచిన్న సమస్యలు వచ్చినా వాటిని ఛేదించగలిగే ధైర్యం తెచ్చుకోవాలి. మృదువుగా చర్చించడమే కాదు, పెద్దవాళ్లకు ఆలోచించుకోవడానికి కాస్తంత సమయాన్ని కూడా ఇవ్వాలి. పిల్లలు సంతోషకరమైన జీవితాన్ని గడపాలనే ఆశ పెద్దవాళ్లలోనూ ఉంటుంది. తామనుకున్నట్లుగానే ఉందనుకుంటే అభ్యంతరాలు ఆవిరిలా కరిగిపోతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్