ఆడపడుచు అర్ధమొగుడు
close
Updated : 14/11/2021 05:02 IST

ఆడపడుచు అర్ధమొగుడు

పెళ్లంటే ఇద్దరు వ్యక్తులే కాదు, రెండు కుటుంబాలకు సంబంధించింది. అత్తమామలు, ఆడపడుచులు, తోటికోడళ్లు.. ఇలా ఎన్నో సంబంధ బాంధవ్యాలుంటాయి. అందరితోనూ సఖ్యతగా ఉండటం బాధ్యత కాదు, అందమైన ప్రేమబంధం. ముఖ్యంగా అర్ధ మొగుడంటూ ఆటపట్టించే ఆడపడచుతో అనురాగం సంసార శకటాన్ని పూలతేరులా నడిపిస్తుంది. అందుకోసం సైకాలజిస్టులు ఇస్తున్న కొన్ని సూచనలూ...

ఆడపడుచులంటే విలన్లు అనే భావన రానీయొద్దు. మీరు స్నేహంగా దగ్గరైతే వాళ్లూ అంతే ఆత్మీయంగా ఉంటారు. వారికి పెళ్లయిపోతే తరచూ రాకపోకలు సాగించండి. ఇంకా కాలేదంటే తోబుట్టువులా భావించండి.

* షాపింగుకు, పార్లర్‌కు, బంధుమిత్రుల ఇళ్లకు ఆమెతో కలిసి వెళ్లండి. ప్రేమనిస్తే ప్రేమే వస్తుందని గుర్తుంచుకోండి.

* ఒకవేళ ఆమెలో ఏదైనా గుణం నచ్చకుంటే అది భర్తకో మరెవరికో చెప్పి గోరంతలు కొండంతలు చేయొద్దు. లోకంలో ఏ ఒక్కరూ లోపాల్లేకుండా ఉండరు, మీలోనూ ఏవో లోపాలు తప్పక ఉంటాయని సరిపెట్టుకోండి.

* ఆమె పుట్టినరోజును చిన్న వేడుకలా జరపండి. చదువులో ఉత్తీర్ణత, ఉద్యోగంలో పదోన్నతి లాంటి వాటికి మనసారా అభినందించండి.

* మీరు దేని గురించైనా వ్యథ చెందుతోంటే, ఏ అంశంలోనయినా తికమకగా అనిపిస్తే ఆమె సలహా అడగండి. అలాగే ఆమె ఏదైనా గందరగోళంలో ఉంటే సాయం చేసి సమస్యను పరిష్కరించండి.

* వాదనలు, పరోక్ష నిందోక్తులు అస్సలు రానీయకండి. ఆమె పరాయి మనిషి కాదు, అదే ఇంట్లో పుట్టి పెరిగింది. ఆమెని అవమానిస్తే అత్తమామలే కాదు, మీ భర్తకూ కోపం, బాధ కలుగుతాయని, మీరూ ఒకింటి ఆడపడుచేనని మర్చిపోకండి.

* ఇవాళ మీరు చూపిన ప్రేమ ఎన్నటికీ వృథా కాదు. రేపు ఆమె పెళ్లయ్యాక మిమ్మల్నీ అలాగే ఆదరిస్తుంది.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని