ప్రేమ బంధం మరింత పదిలం
close
Updated : 21/11/2021 06:35 IST

ప్రేమ బంధం మరింత పదిలం!

వివాహమనే బంధంలోకి ప్రవేశించడం సులువే. అయితే ఆ బంధాన్ని పదిలంగా, బలంగా ఉంచుకోవడం అంటే దంపతులిద్దరూ ఒకరికొకరు అన్నట్లు ఉండాలి. అప్పుడే ఆ బంధం మరింత దృఢంగా, ఆనందంగా మారుతుంది. అందుకు ఏం చేయాలో చూడండి...

మొదటి పలకరింపు మీదే.. నిద్రలేచిన వెంటనే భాగస్వామికి ప్రేమగా, చిరునవ్వుతో గుడ్‌ మార్నింగ్‌ చెప్పండి. రెండు పదాలే అయినా మీ పెదాల వెంబడి వచ్చిన తీరుతో ఫిదా అయిపోతారు. ఒకరికొకరు గుడ్‌ మార్నింగ్‌ చెబుతూ ఆత్మీయంగా ఓ హగ్‌ తీసుకోండి. ఇక ఆ రోజంతా ఇద్దరూ ఆనందంగా, సంతోషంగా ఉండటం ఖాయం.

పనులు పంచుకోండి... ఇంట్లో ఉదయం పనులను షేర్‌ చేసుకోండి. ఉన్నది కొంత సమయమైనా కలసి ఉండటానికి ప్రయత్నించండి. వర్కవుట్లు కలిసి చేయండి. ఆరోగ్యం, ఆనందం మీ సొంతమవుతాయి.

కలసి తినండి...  అల్పాహారాన్ని ఇద్దరూ కలిసి తినండి. ఆ సమయంలో సరదాగా కబుర్లు చెప్పుకోండి. అంత సమయం లేదంటారా... ఉన్న కొద్ది సమయాన్ని సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి. మీకు తెలియకుండానే మిగతా రోజంతా ప్రశాంతంగా, సంతోషంగా గడుస్తుంది.

టచ్‌లో ఉండండి... ఉదయం ఉరుకుల పరుగుల వాతావరణమే ఉంటుంది. ఆఫీసుకు టైమ్‌ అయిపోతుందని ఒకరు, పనులు ఇంకా మిగిలే ఉన్నాయని మరొకరు.... స్కూలుకు వెళ్లే పిల్లలుంటే మరిన్ని బాధత్యలు.

ఎన్ని పనులున్నా... మీ భాగస్వామికి నేనున్నాననే ఓ తలంపునివ్వండి. మీ ప్రేమపూరిత స్పర్శతో తన మనసు దోచేయండి. ప్రేమగా చేతులు పట్టుకోవడం, మెచ్చుకోలుగా భుజం తట్టడం... ఇవన్నీ తనపై మీ ప్రేమను తెలిపే సంకేతాలే. ఇంకెందుకాలస్యం మొదలుపెట్టేయండి మరి.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని