నేర్పితేనే.. తెలిసేది!

చక్కని అలవాట్లతో.. ఉన్నతంగా మన పిల్లలు ఎదిగితే చూడాలని ఏ తల్లికుండదు? కానీ వాళ్లు ఎక్కువగా నేర్చుకునేది అమ్మానాన్నల నుంచే! కాబట్టి, చిన్నతనం నుంచి సద్గుణాలను మనమే అలవాటు చేయాలి.

Updated : 11 Dec 2021 05:51 IST

చక్కని అలవాట్లతో.. ఉన్నతంగా మన పిల్లలు ఎదిగితే చూడాలని ఏ తల్లికుండదు? కానీ వాళ్లు ఎక్కువగా నేర్చుకునేది అమ్మానాన్నల నుంచే! కాబట్టి, చిన్నతనం నుంచి సద్గుణాలను మనమే అలవాటు చేయాలి.
* క్రమశిక్షణ చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి. తమ పనులు తామే చేసుకునేలా చూడాలి. ఇంటి, వంటపని, తోటపనుల్లో వారి సాయమడుగుతూ వాళ్లతో కలిసి పనిచేస్తే ఆనందంతోపాటు పని విలువనీ తెలియజేయొచ్చు. భావోద్వేగాల విషయంలోనూ.. కోపం వచ్చినప్పుడు పది లెక్కపెట్టడమో, బాధ వేస్తే పంచుకోవడమో చేయాలిగానీ అరవడం, ఏడవడం మంచి లక్షణం కాదని చెప్పాలి.
* ఇతరులతో పంచుకోవడం అలవాటు చేయాలి. దీనివల్ల సమానత్వంతోపాటు పంచుకునే గుణం అలవాటవుతుంది. అసూయ వంటివీ దరిచేరవు.
*ఆటపాటల్లో చురుగ్గా పాల్గొనేలా చూడాలి. క్రీడలు పిల్లల్లో సర్దుకుపోయే తత్వం, ఓపిక, లాంటి మంచి గుణాలను అలవరుస్తాయి. కొత్తవారితో కలిసి ఆడటం వల్ల బిడియం, మొహమాటం వంటివి ఉండవు. భవిష్యత్తులో అందరితో కలిసిపోయేందుకూ ఇవి సాయపడతాయి. అలాగే నడక, పరుగు లాంటి వ్యాయామాలనూ చేయించాలి. ఆరోగ్యంతోపాటు ఆనందంగానూ ఉంటారు.
*సానుకూలంగా ఆలోచించడం, మృదువుగా సంభాషించడం చక్కటి సద్గుణాలని చెప్పాలి. ఉదాహరణలతో వివరించాలి. వ్యక్తిగత, పరిసరాల శుభ్రత ప్రాధాన్యాన్నీ సున్నితంగా తెలియజేయాలి. మొదట మీరు సాయం చేస్తే తర్వాత వాళ్లే అలవాటు పడతారు. అలాగే ఇతరుల వస్తువులు తీసుకొచ్చినా, పాడుచేసినా.. ముందు కారణాన్ని తెలుసుకోండి. మందలించండి.. కానీ కోప్పడొద్దు. తాము అలా చేస్తే మీకు నచ్చదన్న విషయం అర్థమైతే చాలు.. వాళ్లే చేయకుండా ఉంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్