శ్రీవారికి నేర్పించండి!

‘పెళ్లంటే నూరేళ్ల పంట కాదు, వెయ్యేళ్ల వంట’ అని ఇల్లాళ్లు.. ముఖ్యంగా ఉద్యోగినులు కోపంగానో, బాధగానో వ్యంగ్యంగానూ మాట్లాడటం మనకేం కొత్త కాదు. కానీ ఆ ఆవేశంలో ఎంత ఉక్రోషం, నిరాశ ఉన్నాయో అర్థం చేసుకుంటే ఈ తీరులో మార్పు రావాలని బలంగా అనిపిస్తుంది. అలాంటి మంచి మార్పు కోసమే ఈ సలహాలు...

Published : 27 Dec 2021 00:42 IST

‘పెళ్లంటే నూరేళ్ల పంట కాదు, వెయ్యేళ్ల వంట’ అని ఇల్లాళ్లు.. ముఖ్యంగా ఉద్యోగినులు కోపంగానో, బాధగానో వ్యంగ్యంగానూ మాట్లాడటం మనకేం కొత్త కాదు. కానీ ఆ ఆవేశంలో ఎంత ఉక్రోషం, నిరాశ ఉన్నాయో అర్థం చేసుకుంటే ఈ తీరులో మార్పు రావాలని బలంగా అనిపిస్తుంది. అలాంటి మంచి మార్పు కోసమే ఈ సలహాలు...

* పనులన్నీ ఒంటిచేత్తో చేసుకుంటూ ఆనక అలసటకు గురై ఆందోళన పడితే లాభం లేదు. భర్తకు కొన్ని పనులు అప్పగించండి. అతను చేయడానికి సిద్ధంగా లేకుంటే.. శారీరకంగా, మానసికంగా కుంగిపోతున్న సంగతి చెప్పండి. అందాకా అలవాటులేక తనకు చేతకాదన్నా, తాను చేయనన్నా క్రమంగా మార్పు వస్తుంది.

* మొదట్లో పనులు సక్రమంగా చేయకపోవచ్చు. ఆ మాత్రానికే చేతకాదని నిర్ధారించుకుంటే ఇక ఎప్పటికీ ఒంటరిగా శ్రమించాల్సిందే. రాని పనుల్లో మెల్లగా
తర్ఫీదిస్తే సరి.

* మీ భర్త పనులు పంచుకోవడం వల్ల మీకెంత సుఖంగా, వెసులుబాటుగా ఉందో చెప్పండి. నేను చేస్తున్నట్టే అతను చేస్తున్నాడు.. ఇందులో గొప్పేంటి అనుకోవద్దు. ప్రతిసారీ కృతజ్ఞతలు చెప్పండి, మనసారా మెచ్చుకోండి. ఈ తీరుతో నిజమైన మార్పు వస్తుంది. లేదంటే ఇంటిపనులు చేయనివారితో పోల్చుకుని తాము అనవసరంగా చేస్తున్నామనుకోవచ్చు,

* ఆయా పనులు అప్పగించడంవల్ల పనిభారం తగ్గడమే కాదు, వాటిల్లో ఉండే కష్టం శ్రీవారికీ అర్థమవుతుంది. వంకలుపెట్టడం, తూలనాడటం లాంటివి చేయరు.

* ‘నువ్వేమీ చేయవు.. నీవల్ల ఇబ్బందిగా ఉంది’ లాంటి నిందోక్తుల వల్ల సమస్య పరిష్కారం కాకపోగా జటిలమవుతుంది. అందుకు భిన్నంగా ‘ఇంత పని ఒక్కదాన్నే చేయలేకపోతున్నాను. ఒత్తిడి భరించలేక అరిచేస్తున్నాను’ తరహాలో బాధను పంచుకోవడం వల్ల అవతలి వ్యక్తి ఆలోచనాతీరు మారుతుంది. నేర్చుకుంటే ఎవరైనా, ఏ పనైనా చేయగలరని వివరించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్