Updated : 02/01/2022 06:44 IST

వీళ్లు.. ఫోన్‌ మానేదెలా?

ఎక్కువ సేపు ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు వాడటం అన్నది పిల్లలు అమ్మానాన్నల నుంచే నేర్చుకుంటారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల శారీరక, మానసిక అనారోగ్యాలు వస్తాయంటున్నారు. దాన్నుంచి వారిని ఎలా తప్పించాలో సూచిస్తున్నారు...

అనారోగ్య సమస్యలు... మొబైల్స్‌, కంప్యూటర్లు, టీవీలతో ఇంటిల్లపాదీ ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. తెరని నిరంతరాయంగా, ఏకాగ్రతతో చూడ్డం వల్ల తలనొప్పి, కళ్లు అలసిపోవడం, పొడారి పోవడం, ఎర్రబడి నీరు కారడం వంటివి మొదలవుతాయి. అవే నేత్ర సమస్యలుగా పరిణమిస్తున్నాయి. వీటి వెలుతురు వల్ల నిద్ర లేమికి గురవుతున్నారు. వాటి ధ్యాసలో పడి వేళకు తినక పోవడం, లేదా పిజ్జా, బర్గర్‌ వంటి చిరుతిళ్లకు అలవడటంతో జీవక్రియలు అదుపు తప్పుతున్నాయి. తద్వారా వయోభేదం లేకుండా అధికబరువు, మధుమేహం వంటి అనారోగ్యాలు వస్తున్నాయి. పెద్ద వారిని అనుసరిస్తూ పిల్లలు కూడా వీటి బారిన పడుతున్నారు.

జాగ్రత్తలు... ఎక్కువ సేపు ఫోన్లు, కంప్యూటర్లు వాడే అమ్మానాన్నను చూసి పిల్లలూ అదే నేర్చుకుంటారు. పిల్లలు ఉన్నత లక్ష్యాలను సాధించాలని మీకుంటే మీరూ వారికి స్ఫూర్తినిచ్చేలా ప్రవర్తించాలి. పెద్దవాళ్లు వీలైనంత తక్కువ సమయాన్ని ఫోన్లు/ గాడ్జెట్లకు కేటాయిస్తే చిన్నారులు కూడా అలాగే నడుచుకుంటారు. మారిన వృత్తి ఉద్యోగాల పరిస్థితుల వల్ల పరికరాల వినియోగం పెరిగింది. కానీ అది కాలక్షేపం కాదని పిల్లలకు అర్థం అయ్యేలా చెప్పాలి. మిగిలిన పనులకు నియమిత సమయమంటూ నిర్దేశించుకుంటే పిల్లలనూ అదే మార్గంలో నడిపించొచ్చు. మీతోపాటు నడకకో వ్యాయామాలకో తీసుకెళ్లడం, కథలు చెప్పడం, మంచి  మంచి పుస్తకాలను చదివి వినిపిస్తూ, ఆడించడం చేయాలి. పిల్లలతో సమయం గడపాలి. అలా వారి దృష్టి మళ్లించగలిగితే అలవాట్లూ మారతాయి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని