పిల్లలే వైద్యులు...

చిన్నారులతో కలిసి ఆడటం ఆనందాన్నివ్వడం తోపాటు తల్లీబిడ్డల అనుబంధాన్నీ రెట్టింపు చేస్తుంది.  అంతేకాదు.. ఒత్తిడి, ఆందోళనలను దూరం చేసే శక్తి పిల్లలకు ఉందని చెబుతున్నారు నిపుణులు.

Published : 03 Jan 2022 01:31 IST

చిన్నారులతో కలిసి ఆడటం ఆనందాన్నివ్వడం తోపాటు తల్లీబిడ్డల అనుబంధాన్నీ రెట్టింపు చేస్తుంది.  అంతేకాదు.. ఒత్తిడి, ఆందోళనలను దూరం చేసే శక్తి పిల్లలకు ఉందని చెబుతున్నారు నిపుణులు.

మరిచిపోవాలి... పిల్లలతో ఆడేటప్పుడు వారి వయసులోకి పెద్దవాళ్లు మారిపోవాలి. వాళ్ల చిన్ని చేష్టలు మానసిక ఆనందాన్ని ఇస్తాయి. వారికీ కొన్ని మధుర జ్ఞాపకాల్ని అందించిన వాళ్లం అవుతాం. వారికి కథ చెప్పేటప్పుడు పూర్తిగా ఆయా పాత్రల్లో లీనమై, నటించి మరీ చెబితేనే బాగా గుర్తుండిపోతుంది. అంతేకాదు ఆ సమయంలో మన మెదడు కూడా పూర్తిగా ఆ సందర్భంలోకి జారిపోతుంది. ఇది ఒత్తిడిని దూరం చేసి మనసును ఉల్లాసంగా మార్చేస్తుంది.

నియమాలకు దూరంగా... చిన్నారుల ఆటల్లో వాళ్ల నియమాలనే పాటించాలి. పెద్దరికాన్ని పక్కన పెట్టేయాలి. క్రికెట్‌, టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌ వంటి వాటిల్లోనూ నిబంధనల గురించి చెప్పొద్దు. వాళ్లకి తెలిసినట్లు ఆడనివ్వండి. లేదంటే వాళ్లకి ఆటపై ఆసక్తి తగ్గుతుంది. క్రమేపీ వాళ్లే నియమ నిబంధనలను అర్థం చేసుకొనే వరకు స్వేచ్ఛగా ఆడనివ్వాలి. అప్పుడు మనసేకాదు... శరీరమూ ఉత్తేజితమవుతుంది.

సమస్యల్లో... ఏదైనా సమస్య ఎదురైనపుడు ఆందోళనకు గురవుతుంటాం. ఆ సమయంలో పిల్లలతో కలిసి పాటలు పాడటం లేదా నృత్యం చేయడం ప్రారంభిస్తే చాలు. అలాగే వాళ్లకు తెలిసిన నృత్యాన్ని పెద్దవాళ్లూ నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. అప్పటివరకు మనసులో దాగి ఉన్న ఒత్తిడి అంతా దూదిపింజలా మాయమవుతుంది. కనీసం రోజుకోసారి ఇలా చేయగలిగితే నిత్యం సంతోషంగా ఉండొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్