చిన్నారికి సమయపాలన..

పిల్లలు తమ పనులను పూర్తి చేయడానికి  ఎక్కువసేపు తీసుకుంటున్నారంటే వారిలో సమయపాలన కొరవడిందని అర్థం. సమయం విలువ, దాన్ని ఎలా వినియోగించాలనేది బాల్యం నుంచే చిన్నారులకు నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అంటున్నారు మానసిక నిపుణులు. క్రమేపీ ఇది క్రమశిక్షణగా మారి భవిష్యత్తులో వారిని లక్ష్యసాధన వైపు అడుగులేసేలా చేస్తుందంటున్నారు....

Published : 17 Jan 2022 00:09 IST

పిల్లలు తమ పనులను పూర్తి చేయడానికి  ఎక్కువసేపు తీసుకుంటున్నారంటే వారిలో సమయపాలన కొరవడిందని అర్థం. సమయం విలువ, దాన్ని ఎలా వినియోగించాలనేది బాల్యం నుంచే చిన్నారులకు నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అంటున్నారు మానసిక నిపుణులు. క్రమేపీ ఇది క్రమశిక్షణగా మారి భవిష్యత్తులో వారిని లక్ష్యసాధన వైపు అడుగులేసేలా చేస్తుందంటున్నారు.

స్ఫూర్తిగా... సమయపాలన నేర్పేముందు తల్లిదండ్రులు దాన్ని పాటించి పిల్లలకు స్ఫూర్తిగా నిలవాలి. పెద్దవాళ్లు ముందుగా తాము చేసే చిన్నచిన్న పనుల్లో  చిన్నారులను భాగస్వాములను చేసి సమయంలోపు పూర్తిచేసే విధానాన్ని ప్రయోగాత్మకంగా శిక్షణనివ్వాలి. ఉదయం నుంచి రాత్రి నిద్రపోయేవరకు ప్రతి నిమిషాన్ని ఉపయోగపడేలా వినియోగించుకోవడం ఎదుటివారి నుంచే పిల్లలు త్వరగా చూసి నేర్చుకుంటారు. అలాకాకుండా పెద్దవాళ్లకు సమయాన్ని వృథా చేయడం అలవాటుంటే మాత్రం దాన్నే చిన్నారులు అనుసరించే ప్రమాదం ఉంది.

క్యాలెండర్‌తో... ప్రతి నెల మొదట్లో ఒక క్యాలెండర్‌లో రానున్న 30 రోజులు పరీక్షలు, హోంవర్క్‌, ఆడుకోవడం వంటివన్నింటినీ పిల్లలు పొందుపరిచేలా చేయించాలి. వ్యక్తిగతంగా దీన్ని ఒక డైరీలా అలవాటు చేయాలి. ఏ రోజుకారోజు వారు పూర్తి చేసిన పనులు, ఎంతసేపు పట్టింది వంటి వివరాలన్నీ రాయమని చెప్పాలి. ప్రతిదానికీ నిర్ధిష్ట సమయాన్ని కేటాయించి ఆ లోపే పూర్తిచేయాలని నిబంధన ఉంచాలి. అప్పుడే వారికి సమయపాలనపై అవగాహన కలుగుతుంది. ఏ పనైనా ముందుగా పూర్తి చేస్తే  చిన్నచిన్న కానుకలు అందించాలి. దీంతో వీలైనంత త్వరగా పనిని పూర్తిచేయడానికి పిల్లలు ఆసక్తి కనబరుస్తారు.

పోటీలతో... క్విజ్‌, బొమ్మలు గీయడం, పరుగుపందెం వంటి చిన్నచిన్న పోటీలు నిర్వహించి నిర్ధిష్ట సమయాన్ని కేటాయించాలి. విజేతగా నిలిస్తే కోరుకున్న బొమ్మలు, పుస్తకాలు బహుమతిగా అందించాలి. పూర్తి చేయలేకపోతే ప్రోత్సహించి తిరిగి ప్రయత్నించమనాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్