అమ్మకూచి కాదు.. మీ ఫ్రెండ్‌

అప్పటిదాకా అమ్మ కొంగు పట్టుకొని తిరిగిన అమ్మాయి కౌమారంలోకి రాగానే మాటకి మాట ఎదురుచెబుతుంది. అప్పుడే ఆ తల్లికి అర్థమైపోవాలి. తను కార్టూన్లు వేస్తూ.. బొమ్మలతో ఆడుకునే చిన్న పిల్ల కాదని. తనకంటూ సొంత వ్యక్తిత్వం నిర్మించుకునే దశలోకి అడుగుపెడుతోందని.

Updated : 03 Feb 2022 05:18 IST

అప్పటిదాకా అమ్మ కొంగు పట్టుకొని తిరిగిన అమ్మాయి కౌమారంలోకి రాగానే మాటకి మాట ఎదురుచెబుతుంది. అప్పుడే ఆ తల్లికి అర్థమైపోవాలి. తను కార్టూన్లు వేస్తూ.. బొమ్మలతో ఆడుకునే చిన్న పిల్ల కాదని. తనకంటూ సొంత వ్యక్తిత్వం నిర్మించుకునే దశలోకి అడుగుపెడుతోందని. ఆ సమయంలో టీనేజీ అమ్మాయి చెడుదారి పట్టకుండా ఏం చేయాలంటే..

* చిన్నపిల్లేం కాదు: ఎంత వయసొచ్చినా తమ పిల్లల్ని కన్నవాళ్లు చిన్నారులుగానే భావిస్తుంటారు. మారాం చేస్తే బుజ్జగిస్తారు. తమ మాటే వినాలనుకుంటారు. కౌమారంలోకి అడుగుపెడుతున్న పిల్లలకు ఇది నచ్చదు. తల్లి అది అర్థం చేసుకోవాలి. మారాలి. వాళ్ల మాటల్ని పట్టించుకోవాలి. అభిప్రాయం తెలుసుకోవాలి.

* వెన్నుదన్నుగా: టీనేజీలోకి రాగానే పిల్లల్లో కొత్త దశ మొదలవుతుంది. ఫోన్లు, సామాజిక మాధ్యమాల వినియోగం పెరుగుతుంది. స్టైలిష్‌గా ఉండాలనుకుంటారు. స్నేహితుల్ని బాగా అనుకరిస్తారు. ఈ వయసులో అపోజిట్‌ సెక్స్‌ పరిచయాలు, ఊహలు మొదలవుతాయి. మరోవైపు చదువు.. వీటన్నింటి కారణంగా తీవ్ర ఒత్తిడికి గురవుతారు. అమ్మ ఇవన్నీ పట్టించుకోవాలి స్నేహితురాలిలా సలహా ఇవ్వాలి.

* భయపెట్టొద్దు: ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తిగా, ఆత్మన్యూనతకు లోనయ్యే అమ్మాయిగా మారేది ఈ వయసులోనే. అప్పటిదాకా అల్లరి చేసినవాళ్లు ఒక్కసారిగా ముడుచుకుపోతారు. గుంభనంగా ఉంటారు. దానికి కారణం.. కౌమారంలో అలా ఉండాలి.. ఇలా ఉండాలి.. అని కన్నవాళ్లు ఆంక్షల చట్రంలో బంధించడమే. చివరికిది ఆత్మన్యూనతకు దారి తీస్తుంది. ఏ విషయంలో అయినా జాగ్రత్తలు చెబితే ఫరవాలేదుగానీ అది భయపెట్టేలా ఉండకూడదు.

* మొండిగా వద్దు: చేతుల్లోంచి ఫోన్‌ లాక్కోవడం.. ఉన్నపళంగా టీవీ కట్టేయడం.. ఫోన్‌కాల్స్‌, చాటింగ్‌ గురించి అతిగా ఆరా తీయడం.. ఇలా చేస్తుంటే పిల్లలకి ఇంట్లో నాకు విలువ లేదు.. మాట చెల్లుబాటు కాదనే అభిప్రాయంలోకి నెట్టేస్తాయి. స్వేచ్ఛ లేదని బాధ పడిపోతుంటారు. వాళ్లకి తగినంత స్వేచ్ఛనిస్తూనే గ్యాడ్జెట్స్‌ అతి వాడకంతో కలిగే అనర్థాలు వివరించాలి.

* నిర్ణయం తీసుకునేలా: వేసుకునే డ్రెస్‌ నుంచి తీసుకునే కోర్సు దాకా.. అన్నీ అమ్మానాన్నలే నిర్ణయిస్తుంటారు. అంతకుముందు అయితే ఓకే. ఇప్పుడు మీ పిల్లలు టీనేజీలోకి వచ్చేశారు. వాళ్లని అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి. సొంతంగా నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపించాలి. దీంతో వాళ్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్