మృదువుగానే మర్యాద నేర్పేద్దాం...

కొందరు పిల్లల్లో గద్దిస్తున్నట్లుగా మాట్లాడటం, పెద్దల పట్ల వినయం చూపకపోవడం, అబద్ధాలు చెప్పడం, ఇతరుల వస్తువులను దొంగిలించడం చూస్తుంటాం. అలాంటివి చూసీ చూడనట్లుగా వదిలేస్తే భవిష్యత్తులో నేరాలకు పాల్పడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు మానసిక నిపుణులు...

Published : 09 Feb 2022 01:13 IST

కొందరు పిల్లల్లో గద్దిస్తున్నట్లుగా మాట్లాడటం, పెద్దల పట్ల వినయం చూపకపోవడం, అబద్ధాలు చెప్పడం, ఇతరుల వస్తువులను దొంగిలించడం చూస్తుంటాం. అలాంటివి చూసీ చూడనట్లుగా వదిలేస్తే భవిష్యత్తులో నేరాలకు పాల్పడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు మానసిక నిపుణులు...

మాట్లాడేది పూర్తికాకుండా ‘ముందు నేను చెప్పేది విను’ అంటూ వస్తారు పిల్లలు. దాన్ని పట్టించుకోకపోవడమో, ‘కాసేపు ఆగలేవా?’ అని నిందించడమో కాకుండా ‘రెండు నిమిషాలు ఆగు నాన్నా.. నువ్వు మాట్లాడేటప్పుడు ఇంకెవరైనా అడ్డొస్తే నీకు నచ్చుతుందా చెప్పు’ అని మృదువుగా నచ్చజెప్పాలి. దాంతో చిన్నారిలో ఆలోచన మొదలవుతుంది. అలా మధ్యలో అడ్డగించడం సరికాదని గ్రహిస్తారు.

ప్రతీ విషయంలో ఆంక్షలు పెట్టి అనుక్షణం భయమూ బెంగల మధ్య పెంచడం ఎంత తప్పో.. పిల్లలను బొత్తిగా ఆడింది ఆట, పాడింది పాటగా పెంచడమూ అంతే తప్పు. స్వేచ్ఛ ఇస్తూనే క్రమశిక్షణ తప్పకుండా చూడటం మన కర్తవ్యం. లేదంటే వాళ్ల భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యే ప్రమాదముంది. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాల్ని సౌమ్యంగానే అయినా సూటిగా, స్థిరంగా చెప్పాలి.

మీ చిన్నారి ఇంటా బయటా ఏదైనా వస్తువును దొంగిలించడం లేదా లాక్కోవడం చేస్తే చిన్నతనం కదా తెలీదులే అని వదిలేయడం సరికాదు. అలా అని తిట్టడం, కొట్టడం వల్లా సమస్య పరిష్కారం కాదు. అలా చేయడం ఎంత అనర్థదాయకమో విడమర్చి చెప్పండి. ఇలాంటి విషయాలను పట్టించుకోకుండా వదిలేస్తే.. రేపు దొంగగా ముద్రపడుతుంది.. ఆనక జీవితం నరకప్రాయంగా మారుతుందని కథల రూపంలో చెప్పండి. డబ్బు, హోదాల కంటే ప్రవర్తన వల్ల ఎక్కువ విలువ, గౌరవం ఉంటాయని అర్థమయ్యేలా వివరించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్