తగినవాడు కాదేమో!

జీవిత భాగస్వామిని వెతుక్కోవడానికి మ్యాట్రిమోనీ సైట్లపై ఆధారపడటం ఇప్పుడు మామూలైంది. మీ వ్యాలెంటైన్‌ను వెతుక్కొనే క్రమంలో పొరబాట్లు చేయట్లేదు కదా! తెలుసుకోవడమెలా? వీటిని పరిశీలిస్తే సరి!

Updated : 13 Feb 2022 04:56 IST

జీవిత భాగస్వామిని వెతుక్కోవడానికి మ్యాట్రిమోనీ సైట్లపై ఆధారపడటం ఇప్పుడు మామూలైంది. మీ వ్యాలెంటైన్‌ను వెతుక్కొనే క్రమంలో పొరబాట్లు చేయట్లేదు కదా! తెలుసుకోవడమెలా? వీటిని పరిశీలిస్తే సరి!

* వివరాలు, ఫ్రొఫైల్‌ నచ్చితే.. అతని సామాజిక మాధ్యమాల ఖాతాలను పరిశీలించండి. తన వివరాలు, ఫొటోలకు మాత్రమే పరిమితమవ్వకండి. తన పోస్టులు దానిపై ఉంచే కామెంట్లు సహా అన్నీ గమనించండి. వివరాలన్నీ గోప్యంగా ఉంచినా, ఖాతా మాత్రమే తెరిచి ఏ పోస్టులు లేకపోయినా అనుమానించాల్సిందే. అంతే కాదు.. పోస్టు చేసే అంశాలు మరీ సానుకూలంగా ఉన్నా, వ్యతిరేక ధోరణులను ప్రదర్శిస్తున్నా అలాంటి వారికి దూరంగా ఉండటమే మేలు.
* ఎదుటి వారిని ఆకర్షించడానికి మాటే ప్రధాన ఆయుధం. అందుకే అబద్ధాలూ చెబుతుంటారు. ఎప్పుడైనా చిన్న చిన్నవి చెబితే చేటు చేయవు. కానీ.. చెప్పే మాటకీ, ప్రవర్తనకీ తేడా ఉంటే మాత్రం దూరంగా ఉండాల్సిందే. మన అనుకున్న వాళ్ల మధ్య లావాదేవీలు మామూలే. పదే పదే ఆర్థిక అవసరాలను ప్రస్తావించడం, డబ్బులు తీసుకోవడం చేస్తున్నా.. అనుమానించాలి. ఈ విషయంలో మొదట ఆత్మీయంగా ఉండి, రోజులు గడిచేకొద్దీ మార్పు వస్తోంటే.. డబ్బు కోసమే ఆశ్రయిన్నారని అర్థం.
* ఒకరితో కలిసి జీవితం గడపాలని నిర్ణయించున్నాక చాలామంది చెప్పే మాట.. ‘మా అభిరుచులు కలిశా’యనే. మరి కలవని వాటి సంగతేంటి? అసలు సమస్య మొదలయ్యేది అక్కడే. వాటి గురించీ తెలుసుకోండి. అలాగే.. ఫోన్‌, చాటింగ్‌ల్లోనే తుది నిర్ణయానికి రాకండి. వ్యక్తిగతంగా కలవండి. అయితే అవి పబ్లిక్‌ ప్రదేశాలయ్యేలా చూసుకోండి. తియ్యని మాటలతోనే సరిపెట్టక చేతల్లోనూ బాధ్యతాయుతంగా ఉంటేనే సరైనవాడని అర్థం. దీనికి పెద్ద సందర్భాలే అవసరం లేదు. చిన్నచిన్న చేతలూ బయటపెడతాయి. గమనించాలంతే!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్