మనసులను ముడివేసే జంట పచ్చబొట్టు

ప్రేమను, తమ మనసులో ఎదుటివారి ప్రాముఖ్యాన్ని చెప్పడానికి జంటలు టాటూ భాషను ఉపయోగిస్తున్నాయి. ఇరు హృదయాలూ ఒకటే అన్నట్టుగా ఈ జంట పచ్చబొట్లు ప్రేమబంధానికి కొత్త అర్థాన్ని

Published : 23 Feb 2022 00:35 IST

ప్రేమను, తమ మనసులో ఎదుటివారి ప్రాముఖ్యాన్ని చెప్పడానికి జంటలు టాటూ భాషను ఉపయోగిస్తున్నాయి. ఇరు హృదయాలూ ఒకటే అన్నట్టుగా ఈ జంట పచ్చబొట్లు ప్రేమబంధానికి కొత్త అర్థాన్ని చెబుతున్నాయి.

* ఆరోజు.. తొలిసారిగా ఒకరినొకరు కలిసిన రోజు ఇద్దరికీ మధురమైన అనుభూతే. దాన్ని మరింత ప్రత్యేకం చేసుకోవడానికి ఆ తేదీలను టాటూగా వేయించుకుంటున్నారు. తమ ప్రేమను వ్యక్తీకరించిన రోజు, పెళ్లి.. లాంటివాటికీ చోటిచ్చేస్తున్నారు. పేర్లు, వాటిల్లోని మొదటి అక్షరాలనూ వేయించుకుంటున్నారు.

* ఇద్దరికీ ఒకటే... ఒకరి గమ్యం ఒకరని అర్థమొచ్చే వాటిని కొందరు ఎంచుకుంటున్నారు. ఒకరు పంజరమైతే మరొకరు పక్షి, ఒకరు తాళమైతే ఇంకొకరు దాన్ని తెరిచే తాళంచెవి.  సూర్యుడు, చంద్రుడు, లేదా రాజు..రాణి అంటూ పచ్చబొట్టు పొడిపించేసుకుంటున్నారు. ఎలా వేసుకున్నా అంతిమంగా ఒకరి మనసు మరొకరితో ముడిపడిందని చెప్పడమే!

* చెరో సగం.. ఇద్దరమూ ఒకటే అని భావం వచ్చేలా ఒకే దాన్ని సగభాగాలుగా చేసి వేయించుకుంటున్నారు. రెంటినీ దగ్గర చేస్తే కానీ అది పూర్తవదు. హృదయం, గులాబీ, సీతాకోక చిలుక.. ఇలా నచ్చినదాన్ని, ప్రత్యేక అర్థమున్న ప్రతిదాన్నీ ఎంచుకుంటున్నారు. ఏదేమైనా మా మనసులు ముడిపడ్డాయంటూ.. సృజనాత్మకంగా చెబుతున్న ఈ ధోరణి నేటి తరాన్ని తెగ   ఆకర్షించేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్