మర్యాదలు నేర్పండి!

బిడ్డకు తల్లే మొదటి గురువు. అమ్మగా చిన్నారికి ప్రేమాభిమానాలు పంచడంతోపాటు వారు పెరిగి పెద్దవారవుతున్న సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, చుట్టూ ఉన్న సమాజంతో ఎలా నడుచుకోవాలో..

Published : 09 Mar 2022 00:54 IST

బిడ్డకు తల్లే మొదటి గురువు. అమ్మగా చిన్నారికి ప్రేమాభిమానాలు పంచడంతోపాటు వారు పెరిగి పెద్దవారవుతున్న సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, చుట్టూ ఉన్న సమాజంతో ఎలా నడుచుకోవాలో నేర్పించాల్సిన బాధ్యత మీదే. అందులో ముఖ్యమైనవి కొన్ని....

* చిన్నారికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు తనకు కావాల్సిన వస్తువునో, మరేదైనా అడగాలంటే మర్యాదపూర్వకంగా అడగమని చెప్పాలి.

* పెద్దవాళ్లు, తోటివాళ్లు... స్నేహితులు, కుటుంబీకులు.. ఇలా ఎవరు సాయం చేసినా అది చిన్నదైనా, పెద్దదైనా వెంటనే కృతజ్ఞతలు చెప్పమనాలి. ఇది తప్పనిసరిగా వారికి నేర్పాలి.

* కొందరు చిన్నారులు ఇంటికి బంధువులు, తల్లిదండ్రుల స్నేహితులు ఎవరొచ్చినా పట్టించుకోకుండా ఫోన్‌లో గేమ్‌ ఆడుకోవడమో, టీవీ చూడటమో చేస్తుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇంటికి వచ్చిన వాళ్లని నమస్తే, బాగున్నారా? ఎలా ఉన్నారు? అంటూ పలకరించడం నేర్పించండి.

* కొంతమంది పిల్లలు ఇతరులతో మాట్లాడేటప్పుడు అటూ ఇటూ దిక్కులు చూస్తూ మాట్లాడతారు. ఇది సరైన విధానం కాదు. ఎవరితో మాట్లాడినా కళ్లలోకి చూస్తూ మాట్లాడమనాలి. అప్పుడే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

* వినడం అనేది ఓ కళ. అది చిన్నారులకు అబ్బేలా చూడాలి. ఎదుటివారు చెప్పేది పూర్తిగా వినమనాలి. ఆ తర్వాతే ఏదైనా ఉంటే చెప్పమనాలి. అంతే తప్ప ఎదుటివారిని మాట్లాకుండా చేసి గడగడా మాట్లాడమనొద్దు.

* కరచాలనం ఎదుటివారిపై మీకుండే అబిమానాన్ని తెలుపుతుంది. ఇప్పుడంటే కొవిడ్‌ మహమ్మారి వల్ల దూరంగా ఉంటున్నాం కానీ.... కరచాలనం ఇద్దరి మధ్య అనుబంధాన్ని మరింత దృఢం చేస్తుందనే విషయం వారికి చెప్పాలి.

* చివరగా.... పెదాలపై చిరునవ్వును ఎప్పుడూ ఉండేలా చూసుకోమనాలి. ఎవరు ఎదురుపడినా ఆప్యాయంగా పలకరించమనాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్