అత్తయ్య చెడుగా ప్రచారం చేస్తోంది

నాకు 25 ఏళ్లు. ప్రేమ పెళ్లి చేసుకున్నా. నా భర్తకు ఇంకా ఏ ఉద్యోగమూ రాలేదు. నాకు బాబు పుట్టి 7 నెలలైంది. ఉద్యోగం చేయాలనుంది కానీ నీరసం, నిస్పృహ. కాస్త పనికే అలసిపోతున్నా. మా అమ్మా వాళ్ల గురించి అత్తయ్య చెడుగా ప్రచారం చేస్తోంది. ఇప్పుడావిడ మాట్లాడటంలేదు. బాబుని చూడటానికైనా రాలేదు. ఆమెతో ఎప్పుడూ సమస్యే. ఏదైనా పరిషారం చెప్పండి.

Updated : 11 Apr 2022 13:24 IST

- ఓ సోదరి

పెద్దల ఆమోదం లేకుండా పెళ్లి చేసుకున్నప్పుడు వ్యతిరేకత ఉండటం సహజం. ప్రేమ పెళ్లిళ్లలో రెండు వైపులా అంగీకరించి ఆదరించడం చాలా తక్కువ. అందుకే ఏదైనా సమస్య వచ్చినా వాళ్ల నుంచి సహకారాన్ని ఆశించకండి. పెళ్లి గురించి ఎలా స్వతంత్ర నిర్ణయం తీసుకున్నారో.. ఇప్పుడూ సొంతంగా పరిష్కరించుకోవాలి. సహకరించకపోవడం, తప్పుపట్టడం, ఆరోపణలు- ఇవన్నీ మామూలే. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లలోని కుటుంబాల్లోనూ సమస్యలుంటాయి. ప్రేమ వివాహాల్లో ఇంకాస్త ఎక్కువ. మీలో మీరు బాధపడటం, ఇతరులను తప్పుపట్టడం- కంటే మీరిద్దరూ కలిసి కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి. పిల్లల్ని చూస్తారని, సాయం చేస్తారని ఆశించొద్దు. పెళ్లప్పుడే పర్యవసానాల గురించి ఆలోచించి ఉంటారు కదా! కాబట్టి ఇప్పుడు బాధ, పశ్చాత్తాపం వద్దు. వ్యతిరేక ఆలోచనలు వదిలి మీరిద్దరూ సమస్యలను పరిష్కరించుకోండి. ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నించండి. తలనొప్పి, ఒళ్లు నొప్పులు, ఏకాగ్రత లేకపోవడం, అనాసక్తి, నిస్పృహ, ఆకలి, నిద్ర లేకపోవడం- ఇవన్నీ ఆందోళన లక్షణాలు. మానసిక నిపుణుల్ని కలిస్తే కౌన్సిలింగ్‌ ఇస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్