పాల పళ్లను పట్టించుకుంటున్నారా?
కొంతమంది పిల్లలు పేస్ట్‌ని జామ్‌లా తింటారు.. మరికొంతమంది బుజ్జాయిలు పాలు తాగుతూ తాగుతూ నిద్రలోకి జారుకుంటారు. ఆ పాల డబ్బాని అలానే నోట్లో ఉంచేసుకుంటారు... ఈ అలవాట్లు మనకి పెద్ద పొరపాట్లలా అనిపించకపోవచ్చు.. కానీ పాలపళ్లకి తీవ్రమైన హానిచేస్తాయి...
కొంతమంది పిల్లలు పేస్ట్‌ని జామ్‌లా తింటారు.. మరికొంతమంది బుజ్జాయిలు పాలు తాగుతూ తాగుతూ నిద్రలోకి జారుకుంటారు. ఆ పాల డబ్బాని అలానే నోట్లో ఉంచేసుకుంటారు... ఈ అలవాట్లు మనకి పెద్ద పొరపాట్లలా అనిపించకపోవచ్చు.. కానీ పాలపళ్లకి తీవ్రమైన హానిచేస్తాయి...
పాలపళ్లే కదా.. అవిపోయి గట్టిదంతాలు వస్తాయిలే! అని చాలామంది శ్రద్ధ పెట్టరు. కానీ పాలపళ్ల సమయంలో కలిగే ఇన్‌ఫెక్షన్లు తర్వాత వచ్చే శాశ్వత దంతాలని కూడా ప్రభావితం చేస్తాయి. అధ్యయనాల ప్రకారం ప్రతి ఐదుగురు పిల్లల్లో ముగ్గురు దంత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అందుకే పిల్లలని ఏడాదికి ఒకసారైనా డెంటిస్ట్‌కి చూపించాలి.
‘పాలు తాగే పిల్లలే కదా... వీళ్లకున్న రెండు పళ్లనీ ఏం శుభ్రం చేస్తాంలే’ అనుకుంటాం. కానీ అది తప్పు. మృదువైన కుచ్చులతో, వేలుకి తొడుక్కొనే రబ్బరు బ్రష్‌లుంటాయి. పిల్లలు పాలు తాగిన తర్వాత, లేదా తెల్లారి... వాటితో చిగుళ్లని శుభ్రం చేయాలి. లేదంటే శుభ్రమైన కాటన్ వస్త్రానికి కొద్దిగా పసుపురాసి దాంతో రుద్ది కూడా శుభ్రం చేయొచ్చు. ఇలా చేయడం వల్ల నోట్లో ఇన్‌ఫెక్షన్లు రావు.
చాలామంది పిల్లలు సిప్పర్లు, పాలబాటిళ్లు నోట్లో పెట్టుకుని తాగుతూ తాగుతూ నిద్రలోకి జారుకుంటారు. ఈ అలవాటు దంతాలపై ఉండే ఎనామిల్‌ని పోగొడుతుంది. కారణం పాలు, జ్యూసుల్లో కలిపిన పంచదార పళ్లపై రక్షణ పొరగా ఉన్న ఎనామిల్‌ని తొలగిస్తుంది. దాంతో దంతాలు రంగు మారిపోవడం, విరిగిపోవడం జరుగుతుంది. కొన్నిసార్లు వీటి ప్రభావం ఆ తర్వాత వచ్చే గట్టిదంతాలపైనా పడుతుంది. అందుకే పాలబాటిల్ అలవాటుని అసలు ప్రోత్సహించ వద్దు. పండ్లరసాలు, పాలు ఏమిచ్చినా గ్లాసులోనే ఇవ్వండి. తీపి తింటే నోటిని నీటితో కడిగేయండి.
ఫ్లోరైడ్ ఉన్న టూత్‌పేస్ట్‌నే వాడాలి. అలాగని ఎంత పడితే అంత కాదు. మూడేళ్లలోపు పిల్లలకయితే ఒక బియ్యపు గింజంత, మూడేళ్లు దాటితే బఠాణి గింజంత చాలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.