మీ అనుభవాలే వారికి పాఠాలు..
కవిత తన పిల్లలతో ప్రతి నిమిషం ‘మేం చిన్నప్పుడు ఇలా ఉండేవాళ్లం కాదు, అలా ప్రవర్తించేవాళ్లం కాదు’ అని చెబుతుంటుంది. కాలం మారింది. మారుతున్న జీవనశైలిని దృష్టిలో ఉంచుకుని మరీ చిన్నారులను పెంచాలంటున్నారు నిపుణులు.
కవిత తన పిల్లలతో ప్రతి నిమిషం ‘మేం చిన్నప్పుడు ఇలా ఉండేవాళ్లం కాదు, అలా ప్రవర్తించేవాళ్లం కాదు’ అని చెబుతుంటుంది. కాలం మారింది. మారుతున్న జీవనశైలిని దృష్టిలో ఉంచుకుని మరీ చిన్నారులను పెంచాలంటున్నారు నిపుణులు.
అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య... అంటూ ఉమ్మడి కుటుంబంలో మీ బాల్యం ఆనందంగా గడిచి ఉంటుంది. ప్రస్తుతం చిన్నారులకు ఆ తరహా వాతావరణం లేదు. తల్లిదండ్రులు, తోబుట్టువులు మాత్రమే ఉంటున్నారు. కొందరైతే ఇంట్లో ఒంటరిగా పెరుగుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో వారి ఆలోచనా ధోరణి, ఆహారపుటలవాట్ల వంటివన్నీ మీకన్నా భిన్నంగా ఉంటాయి. అందరి మధ్య పెరిగిన మీకు, మీ పిల్లల బాల్యానికీ చాలా తేడా ఉంది. అప్పటి మమకారాన్ని చూపిస్తూ.. చుట్టూ ఎవరూ లేరనే భావన దరికి రాకుండా ప్రేమగా పెంచాలి. ఎదుటివారినీ ప్రేమించి సాయం చేసేలా అలవాటు చేయాలి.
పండగలు... ఒకప్పటి పండగల వాతావరణం ఇప్పుడు లేదు. అలాగని వాటి గురించి అవగాహన లేకుండా మాత్రం పిల్లలను పెంచకూడదు. మీ చిన్నతనంలో మీరు నేర్చుకున్న సంస్కృతి, సంప్రదాయాలను వారికీ అందించాలి. పండగల ప్రాశస్త్యాన్ని తెలిసేలా చేయాలి. పండగలకు కారణాలను, వాటి ద్వారా పొందే ఫలితాలను చెప్పాలి.
విలువలు.. ఒంటరిగా పెరుగుతున్న నేటితరం పిల్లలకు బంధువుల మధ్య ఉండే ఆప్యాయత, అనురాగాల గురించి చెప్పాలి. అవసరమైనప్పుడు ఒకరికొకరు ఎలా సాయపడేవారో ఆ అనుభవాలను తెలియజేయాలి. కుటుంబ విలువలతోపాటు వ్యక్తుల ప్రాధాన్యతనూ వివరించాలి. సమయం దొరికినప్పుడు బంధువుల ఇళ్లకు తీసుకువెళ్లాలి. మీ చిన్నప్పుడు బంధువులతో ఏర్పడిన అనుబంధం, ఆ తీపి జ్ఞాపకాలన్నీ పిల్లలతో పంచుకోవాలి. వినడానికి సరదాగా ఉండటమే కాకుండా, చిన్నారుల మనసులో ఇవి నిక్షిప్తమవుతాయి. ఇవన్నీ వారిలో కుటుంబమంటే అసలైన అర్థాన్ని తెలియజేస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.