మీరైతే ఏం చేస్తారు?!

ఏ తల్లిదండ్రులూ తమ పిల్లలు చెడిపోవాలని కోరుకోరు.. కానీ వారలా తయారవడంలో పెద్దల పాత్ర లేకున్నా సరే.. నిందలు తప్పవు. కారణం ఏదైనా కానీ గాడి తప్పుతున్నప్పుడు కనిపెట్టక పోవడం, సరి చేయక పోవడం పెద్దల తప్పిదమేనంటున్నారు మనో విశ్లేషకులు. వాళ్లే తెలుసుకుంటార్లే అని ఊరుకోకుండా ఏం చేయాలని చెబుతున్నారంటే...

Published : 18 May 2022 01:17 IST

ఏ తల్లిదండ్రులూ తమ పిల్లలు చెడిపోవాలని కోరుకోరు.. కానీ వారలా తయారవడంలో పెద్దల పాత్ర లేకున్నా సరే.. నిందలు తప్పవు. కారణం ఏదైనా కానీ గాడి తప్పుతున్నప్పుడు కనిపెట్టక పోవడం, సరి చేయక పోవడం పెద్దల తప్పిదమేనంటున్నారు మనో విశ్లేషకులు. వాళ్లే తెలుసుకుంటార్లే అని ఊరుకోకుండా ఏం చేయాలని చెబుతున్నారంటే...

* చిన్నారులు తోడపుట్టిన వాళ్లతో లేదా తోటి పిల్లలతో తరచుగా గొడవపడటం లేదా తిట్టి కొట్టడం చేస్తుంటే అలసత్వం ప్రదర్శించొద్దు, ఆనక మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఎందుకలా ఉద్రేకం వస్తోందీ ఆ తీవ్ర ప్రతిస్పందనకు కారణమేంటి అనేవి తెలుసుకుని నివారించే ప్రయత్నం చేయాలి.

* చిన్నారి కోపంగా ఉన్నప్పుడు కాసేపు ఏమీ అనకుండా మౌనంగా చూడండి. మీరు గమనించి కూడా ఏమీ అనలేదంటే చిన్నారిలో పశ్చాత్తాపం బయల్దేరుతుంది. తాను తప్పు చేసినట్లు ఒప్పుకొని బాధపడుతూ క్షమాపణ కోరే అవకాశం ఉంది. అలా అడగలేదంటే చిన్నారిలో అలజడి స్థాయి మరింత ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. ఉద్వేగం కాస్త చల్లారనిచ్చి, ఎందుకు పేచీ పడుతున్నదీ నెమ్మదిగా కూపీ లాగాలి. ఏ అసంతృప్తి కారణంగా అంత అసహనానికి గురవుతున్నదీ తెలుసుకుని బుజ్జగించి చెబుతూ దాన్నుంచి బయటపడేలా చేయాలి. ఒకవేళ అవతలి పిల్లలు విసిగిస్తున్నందున కోపం చూపుతున్నట్లయితే వాళ్లని పిలిచి మాట్లాడి సమస్యను పరిష్కరించాలి.

* ఇంకో అడుగు ముందుకేసి మీ చిన్నారితో బాటు పొరుగు పిల్లలను కూడా కూర్చోబెట్టి ఏవైనా సమస్యలను కథల రూపంలో చెప్పండి. ‘ఇలాంటి పరిస్థితి ఎదురైతే మీరైతే ఏం చేస్తారు? తెలివిగా ఆలోచించి చెప్పండి.. చూద్దాం’ అంటూ సవాల్‌ విసరండి. ఆ చిట్టి మేధావులు ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రణాళిక రూపొందించినంత దీక్షగా ఆలోచిస్తారు. ఎవరికి తోచిన పరిష్కారాలు వాళ్లు చెబుతారు. అవి బాగాలేదని నిరాశపరిచేలా చెప్పకుండా ఎంతవరకూ ఆచరణసాధ్యమో చర్చించండి. సమస్యలకు కుంగిపోవడం, చిరాకు పడటం కాకుండా మెదడును పదునుగా చేసుకోవాలని అర్థం చేసుకుంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్