అంతమందిని చూస్తే భయం...
నా పేరు సుగుణ. వయసు 26. సిద్దిపేట పక్కన చిన్న గ్రామం. నేను బయట ముగ్గురు నలుగురి కంటే ఎక్కువమంది ఉంటే భయం, తడబాటుతో మాట్లాడలేను. ఈ సమస్య నన్నేగాక ఇంట్లోవాళ్లనూ బాధపెడుతోంది.
నా పేరు సుగుణ. వయసు 26. సిద్దిపేట పక్కన చిన్న గ్రామం. నేను బయట ముగ్గురు నలుగురి కంటే ఎక్కువమంది ఉంటే భయం, తడబాటుతో మాట్లాడలేను. ఈ సమస్య నన్నేగాక ఇంట్లోవాళ్లనూ బాధపెడుతోంది. ఈ భయాన్నెలా పోగొట్టుకోవాలో చెప్పండి!
- ఓ సోదరి
ఎక్కువమంది ఉంటే మాట్లాడలేకపోవడాన్ని సోషల్ యాంగ్జయిటీ డిజార్డర్ అంటారు. పరిచయస్తులు, ఆర్థికంగా, సామాజికంగా సమాన స్థాయిలో ఉన్నవారితో మాట్లాడగలుగుతారు. కొత్తవాళ్లు లేదా తమకంటే హెచ్చుస్థాయిలో ఉన్నవారితో మాట్లాడటానికి సంకోచం, భయం, కంగారు, కాళ్లూచేతులూ వణకడం, అక్కణ్ణించి తప్పించుకుని పారిపోవాలనుకోవడం జరుగుతుంది. తన ఉనికిని తానే గుర్తించలేకపోవడం, తనను తాను తక్కువగా ఊహించుకోవడం, ఆత్మవిశ్వాసం లేకపోవడం లాంటి కారణాలతో ఇలా జరుగుతుంది. పెద్దయ్యాక మార్పు వస్తుందిలెమ్మని అమ్మానాన్నలు పట్టించుకుని ఉండరు. మానసిక నిపుణులని కలవండి. ఎస్సెస్సారైఎస్.. యాంటీ డిప్రెసెంట్స్‌తో సోషల్ యాంగ్జయిటీని చాలావరకూ తగ్గించవచ్చు. సమస్య తీవ్రతను బట్టి ఆర్నెల్ల నుంచి ఏడాదిపాటు మందులు వాడాల్సి ఉంటుంది. డీసెన్సిటైజేషన్‌తో భయాన్ని, కాగ్నెటిక్ బిహేవియరల్ థెరపీతో నెగెటివ్ ఆలోచనలు పోగొడతారు. నలుగురిలో ఎలా మెలగాలో నేర్పిస్తారు. సామర్థ్యాన్ని పెంచడానికి సోషల్ స్కిల్స్‌లో తర్ఫీదిస్తారు. దాంతో మీ భయం పోతుంది. మెల్లమెల్లగా మీలో మార్పు వస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.