ఈ పాలు పిల్లలకు ఇస్తున్నారా... ఒక్క నిమిషం!

పిల్లల పోషణ... పాలతో పరిపూర్ణమవుతుంది.  అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తాజా పాలు దొరకడం కొంచెం కష్టమే. దాంతో చాలామంది... ముఖ్యంగా పట్టణాలూ, నగరాల్లోని వాళ్లు ప్యాకెట్‌ పాలను వాడటానికే మొగ్గు చూపుతుంటారు.

Updated : 28 Mar 2024 18:10 IST

పిల్లల పోషణ... పాలతో పరిపూర్ణమవుతుంది.  అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తాజా పాలు దొరకడం కొంచెం కష్టమే. దాంతో చాలామంది... ముఖ్యంగా పట్టణాలూ, నగరాల్లోని వాళ్లు ప్యాకెట్‌ పాలను వాడటానికే మొగ్గు చూపుతుంటారు. అయితే, వీటి ఎంపికలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అనారోగ్యాలు తప్పవని హెచ్చరిస్తున్నారు నిపుణులు. దీని మీద కార్నెల్‌ యూనివర్సిటీ చేసిన పరిశోధనలో ఎన్నో ఆశ్చర్యకర విషయాలు వెల్లడయ్యాయి. పేపర్‌బోర్డు లేదా టెట్రా ప్యాకింగుతో తయారైన పాల డబ్బాల్లో  బ్యాక్టీరియా శాతం అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. కారణాలను అన్వేషిస్తే... పాలను శుద్ధి చేసిన తరవాత వాటిని డబ్బాల్లో నింపడానికి వినియోగించే మెషిన్లే ఇందుకు కారణమని తేల్చారు. ఇందులో భాగంగా మిల్క్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లలో పాల శాంపిళ్లను తీసుకుని పరీక్షించారు. వారం తరవాత వాటిల్లోని పాలు 30శాతం పాడైతే, రెండు వారాలకల్లా 41శాతం పాడైనట్లు గుర్తించారు. అంతేకాదు  రుచిలోనూ తేడాను గమనించారట. మరో విషయం ఏంటంటే... పెద్ద కంటైనర్లలోని పాలకంటే చిన్న కంటైనర్లలోని పాలు త్వరగా పాడవుతున్నాయనీ చెబుతున్నారు. యంత్రాల వాడకం పెరగడం, వాటిని శుభ్రం చేయడం  క్లిష్టతరంగా ఉండటమే ఈ పరిస్థితికి దారితీస్తోందనీ, ఈ మెషిన్లను మరింత శ్రద్ధతో శుభ్రం చేయాలనీ, అవసరమైతే వాటి డిజైన్‌లోనూ మార్పులు చేయాలని ఆయా సంస్థలకు సూచిస్తున్నారు పరిశోధకులు. వినియోగదారులు ఈ టెట్రా ప్యాకెట్లనూ, పేపర్‌బోర్డు కంటైనర్లనూ వినియోగించడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ముఖ్యంగా గర్భిణులూ, పిల్లలూ వీటిని వాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్