ఆ బలగాల్లో ఆమె!
తన తాత, ముత్తాతలు దేశంకోసం ఎంతో త్యాగం చేశారు. వాళ్ల వీరోచిత గాథలు వింటూ పెరిగిందేమో, తనూ అదే బాటలోకి వెళ్లాలనుకుంది. తాజాగా జమ్ము-కశ్మీరు నుంచి సెంట్రల్ ఆర్మ్డ్‌పోలీస్ ఫోర్సెస్‌లో స్థానం సంపాదించుకొని ఆ ఘనత పొందిన తొలి మహిళగా ప్రసంశలందుకుంది సిమ్రన్‌బాలా.. జమ్ము-కశ్మీరులోని నౌషెరా సమీప గ్రామానికి చెందిన సిమ్రన్ సెంట్రల్ ఆర్మ్డ్‌పోలీస్ ఫోర్సెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది.
తొలి అడుగు
తన తాత, ముత్తాతలు దేశంకోసం ఎంతో త్యాగం చేశారు. వాళ్ల వీరోచిత గాథలు వింటూ పెరిగిందేమో, తనూ అదే బాటలోకి వెళ్లాలనుకుంది. తాజాగా జమ్ము-కశ్మీరు నుంచి సెంట్రల్ ఆర్మ్డ్‌పోలీస్ ఫోర్సెస్‌లో స్థానం సంపాదించుకొని ఆ ఘనత పొందిన తొలి మహిళగా ప్రసంశలందుకుంది సిమ్రన్‌బాలా..
జమ్ము-కశ్మీరులోని నౌషెరా సమీప గ్రామానికి చెందిన సిమ్రన్ సెంట్రల్ ఆర్మ్డ్‌పోలీస్ ఫోర్సెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. ‘మా గ్రామం దేశ సరిహద్దులో ఉండటంతో బాల్యం నుంచి తుపాకీ గుళ్ల శబ్దాల మధ్య పెరిగా. మా ముత్తాత, తాత సైన్యంలో పనిచేసి దేశానికి సేవలందించారు. వారి గురించి అమ్మ చెబుతుంటే వింటూ స్ఫూర్తి పొందా. వాళ్లలాగే దేశానికి నా వంతు సేవలందించాలని కలలు కనేదాన్ని. ఇప్పటివరకు జమ్ము-కశ్మీరు నుంచి అమ్మాయిలెవరూ ఈ బలగాల్లో లేరు. మా ఊరిలో పది వరకు చదివా. చిన్నప్పటి నుంచి కుటుంబాన్ని వదిలి ఉండని నేను ఎనిమిదేళ్లపాటు అందరికీ దూరంగా ఉండి చదువుకున్నా. గాంధీనగర్ మహిళా కళాశాలలో డిగ్రీలో చేరి మూడో ఏడాది నుంచే కష్టపడి.. 82వ ర్యాంకు సాధించా. ప్రస్తుతం సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్‌లో అసిస్టెంట్ కమాండెంట్‌గా నియమితురాలినయ్యా. ముందుగా ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకొని దాన్ని ఛేదించడానికి అహర్నిశలూ కష్టపడితే చాలు. అనుకున్నదాన్ని ఎవరైనా సాధించొచ్చు’ అంటున్న సిమ్రన్ అందరికీ స్ఫూర్తిదాయకం కదూ.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.