ప్చ్‌.. మెమరీ నిండింది!

ఎంత జీబీ మెమరీ ఉన్న ఫోన్‌ అయినా.. అమ్మాయిలకు సరిపోదు. కొత్త డ్రెస్‌ వేసినా, అందమైన వస్తువులు కనిపించినా, స్నేహితులను కలిసినా గుర్తొచ్చేది ఫొటోనే!

Published : 28 Jun 2023 00:42 IST

ఎంత జీబీ మెమరీ ఉన్న ఫోన్‌ అయినా.. అమ్మాయిలకు సరిపోదు. కొత్త డ్రెస్‌ వేసినా, అందమైన వస్తువులు కనిపించినా, స్నేహితులను కలిసినా గుర్తొచ్చేది ఫొటోనే! ఆన్‌లైన్‌ కొనుగోళ్లకు ఒక్కోదానికి ఒక్కో యాప్‌.. ఇలా నింపేస్తూ పోతే.. నిండక ఉంటుందా మరి? ఖాళీ కావాలా.. ఈ చిట్కాలు ప్రయత్నించి చూడండి.

  • ఒక్క ఫొటోకి.. ఎన్ని క్లిక్‌ మనిపిస్తాం! స్టేటస్‌, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌ల్లో కనిపించేది కొన్నే. పోస్ట్‌ చేయనివి ఇంకెన్నో మిగిలిపోతాయి. ఒక్కో పోజ్‌లో బాగున్నవి వరకూ ఎంచి, మిగతావి డిలీట్‌ చేస్తే సరి. చాలా మెమరీ మిగులుతుంది. గూగుల్‌ ఫొటోలు ఎనేబుల్‌ చేయండి. ఫొటోలన్నీ క్లౌడ్‌ స్టోరేజ్‌లోకి వెళ్లిపోతాయి. ఫోన్‌లోంచి తీసేసినా అక్కడ తేదీల వారీగా దొరుకుతాయి.
  • ఒక్కోసారి ఏదో అవసరమై యాప్‌ వేస్తాం. ఉదాహరణకి.. ఏదో ఊరు వెళ్లాలని ప్రయాణాలకి సంబంధించినవి వేస్తాం. తరచూ ప్రయాణాలు చేసేవారికి ఇవి అవసరమే. అప్పుడప్పుడూ చేసేవారైతే? మెమరీ దండగేగా? అలాంటివి షాపింగ్‌, సర్వీసుల యాప్‌లు ఏమున్నాయో చూసి డిలీట్‌ చేసేయండి.
  • పాట నచ్చిందంటే డౌన్‌లోడ్‌ చేయాల్సిందేనా? విన్నా వినకపోయినా ‘బోర్‌ కొడితే పనికొస్తా’యని దాస్తూ పోతే మెమరీ నిండదూ? జీబీలకొద్దీ నెట్‌ వాడుతున్న రోజులివి! నచ్చినవి ఎప్పుడు, ఎక్కడైనా వినొచ్చు. నెట్‌ దండగ అనిపిస్తే ఉచితంగా పాటలందించే యాప్‌లెన్నో! కావాలంటే సేవ్‌ కూడా చేసుకోవచ్చు. యూట్యూబ్‌లోనూ పర్సనల్‌ లైబ్రరీ పెట్టుకోవచ్చు.
  • మెయిల్‌ తెరిస్తే స్పామ్‌, జంక్‌, డ్రాఫ్ట్‌ ఫైల్స్‌ ఎన్నో! వాటినీ ఎప్పటికప్పుడు తొలగించేయండి. ఇవీ మెమరీని నింపేవే! సోషల్‌ మీడియాలో పోస్ట్‌ల ఫొటోలూ తిరిగి ఫోన్‌లోకి డౌన్‌లోడ్‌ అవుతుంటాయి. అది ఆఫ్‌ చేయండి. వాట్సప్‌ గ్రూపుల్లోనే అమ్మకాలిప్పుడు. సభ్యులై ఉంటే పోస్ట్‌ చేసే ఫొటోలన్నీ ఫోన్‌లోకే! ‘మీడియా విజిబిలిటీ’ ఆఫ్‌ చేస్తే తర్వాత ఇలా సమస్య కాకుండా ఉంటాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్