అపూర్వ కళా కోవిదురాలు

‘‘పిట్ట కొంచెం కూత ఘనం’’ ఆమెకు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే 11 ఏళ్లకే తన తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులకు  గణిత పాఠాలు చెప్పిందామె.

Published : 27 Jul 2023 00:02 IST

‘‘పిట్ట కొంచెం కూత ఘనం’’ ఆమెకు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే 11 ఏళ్లకే తన తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులకు  గణిత పాఠాలు చెప్పిందామె. టీచర్‌ చెప్పింది యథాతథంగా ఫాలో అవ్వాల్సిన వయసులో పాఠ్యాంశాల్లో మెలకువలు చెప్పడం  ఎవరికైనా సాధ్యమంటారా... ఇదొక్కటే అపూర్వ ప్రత్యేకత అనుకుంటే తప్పులో కాలేసినట్లే. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందామా..

పూర్వ పనిదపు శాన్‌ఫ్రాన్సిస్కోలో పుట్టిన భారతీయ మూలాలు ఉన్న యువతి. తల్లిదండ్రులిద్దరూ ఇంజినీర్లు. ఉద్యోగరీత్యా  విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆరేళ్ల వయసులోనే అపూర్వ ఎక్కాలను చకచక అప్పజెప్పేయడం చూసి ఆశ్చర్యపోయారు. ఆ వేగానికి మరింత ఉత్తేజాన్ని అందించాలనుకున్నారు. కాలిఫోర్నియాలోని శాన్‌జోస్‌ పాఠశాలలో చేర్చారు. 11 ఏళ్లు వచ్చేసరికి తన స్నేహితులు లెక్కలంటే భయపడటం చూసి వాళ్లకి కొత్త మెలకువలు నేర్పాలనుకుంది. లెక్కల్ని సులువుగా చేసే పద్ధతుల్ని అందరికీ పరిచయం చేసింది. అదిచూసి టీచర్లందరూ ఆశ్చర్యానికి గురయ్యారట. అప్పటి నుంచి అడ్వాన్స్‌డ్‌ మ్యాథ్స్‌లో సాధన చేయడం మొదలుపెట్టింది. గ్రాడ్యుయేషన్‌ స్థాయి కోర్సులను అతిపిన్న వయసులోనే పూర్తిచేసిన మొదటి అమ్మాయిగా గుర్తింపు పొందింది. తన 12వ ఏట అంతర్జాతీయ టెలివిజన్‌ కార్యక్రమంలో పాల్గొని ‘హ్యూమన్‌ కాలిక్యులేటర్‌’ బిరుదును సొంతం చేసుకుంది.

అన్నిటా మేటి

అపూర్వ ప్రతిభ ఒక్క గణితశాస్త్రానికే పరిమితం కాలేదు. ఆర్ట్స్‌ మీద మక్కువతో రకరకాల పెయింటింగ్స్‌ను వేయడం నేర్చుకుంది. లింగ సమానత్వం, శాంతి, ఓర్పు, యుద్ధ బీభత్సం, రాకెట్‌ లాంచ్‌లు వంటి సమకాలీన అంశాల నేపథ్యంలో పెయింటింగ్స్‌ వేస్తుంది. నల్లజాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ చిత్రాన్ని గీసి గ్లోబల్‌ పీస్‌ బహుమతిని సొంతం చేసుకుంది. తన పేరుతో ఒక వెబ్‌సైట్‌ను మొదలుపెట్టి, దానిలో తన పెయింటింగ్స్‌ను ఉంచుతోంది. ఎగ్జిబిషన్లు, పోటీల్లో వీటిని ప్రదర్శిస్తోంది. వచ్చిన మొత్తాన్ని భారత్‌లో దృష్టిలోపం ఉన్న పిల్లలకు, ఆఫ్రికాలో దుర్భరమైన పేదరికంలో మగ్గిపోతున్న చిన్నారుల సంక్షేమానికి వెచ్చిస్తోంది. మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుని శిక్షకురాలైంది. ఈమె మంచి వక్త, వయోలినిస్ట్‌ కూడానూ.

విజయాలు..

గత ఏడేళ్లుగా ప్రెసిడెంట్‌ వాలంటీర్‌ సర్వీస్‌ అవార్డును అందుకుంటోంది. గణితంలో ఆమెకున్న వేగానికి గుర్తింపుగా రామానుజన్‌ ఫెలోషిప్‌ వరించింది. డయానా అవార్డునూ సొంతం చేసుకుంది. గణితానికి సంబంధించిన రంగాల్లో ఆడపిల్లలకు ఉన్న అవకాశాలను వివరిస్తూ గర్ల్స్‌ లీడర్‌షిప్‌ అకాడెమీ మీటప్‌కి గ్లోబల్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. అందులో భాగంగానే అమ్మాయిల్ని శాస్త్ర సాంకేతిక రంగాల్లో నాయకత్వ, వృత్తి నైపుణ్యాల దిశగా ప్రోత్సహిస్తోంది. నాసా లాంగ్లీ రిసెర్చ్‌ సెంటర్‌ సెంటెనియల్‌ స్టూడెంట్‌ ఆర్ట్‌ కాంటెస్ట్‌ గ్రాండ్‌ బహుమతినీ గెలుచుకుంది. శాస్త్ర, సాంకేతిక, సామాజిక రంగాల్లో ఆమె సేవలకుగానూ గ్లోబల్‌ చైల్డ్‌ ప్రాడజీ అవార్డు సొంతం చేసుకుంది 18 ఏళ్ల అపూర్వ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్