వివక్షపై పోరాటం... షేర్నీ

ఎన్నో ఆశలతో ఫారెస్ట్‌ ఆఫీసర్‌ అయ్యిందామె. ఏకంగా తొమ్మిదేళ్లు పదోన్నతే ఎరుగదు. పేరుకే ఫారెస్ట్‌ ఆఫీసర్‌... చేసేదేమో డెస్క్‌ ఉద్యోగం.

Updated : 02 Mar 2024 06:46 IST

న్నో ఆశలతో ఫారెస్ట్‌ ఆఫీసర్‌ అయ్యిందామె. ఏకంగా తొమ్మిదేళ్లు పదోన్నతే ఎరుగదు. పేరుకే ఫారెస్ట్‌ ఆఫీసర్‌... చేసేదేమో డెస్క్‌ ఉద్యోగం. నిరాశలో ఉన్న ఆమెకు ఫీల్డ్‌లో పనిచేసే అవకాశం వస్తుంది. కానీ తొలిరోజే ‘పరిస్థితి ఇలా ఉంటే ఒక లేడీ ఆఫీసర్‌ని పంపారా?’ అన్న కిందివాళ్ల కామెంట్లు ఎదురవుతాయి. తోటివారు కలిసి పనిచేయరు. పైవాళ్లు విలువనివ్వరు. ఏం చేద్దామన్నా రాజకీయ ఒత్తిళ్లు. అసంతృప్తితో ఉద్యోగం చేయడం కంటే మానేయడమే నయమని భర్తకి చెబితే ఎలాగోలా కొనసాగమంటాడు. అందులోనూ ఆమె చేయగలదన్న ప్రోత్సాహం ఉండదు. జీతం రాదేమోనన్న బెంగే! దీనికితోడు ఆమె పనిచేసే ప్రాంతంలో పులి సమస్యల్ని సృష్టిస్తుంది.

అది పాడి పశువులతోపాటు మనుషులనీ చంపుతుంది. ఈమేమో పులిని ప్రాణాలతో పట్టుకోవాలని! ప్రజలేమో దాన్ని చంపేయాలని. ఈక్రమంలో మరో ప్రాణం బలవుతుంది. ఓపిక నశించిన గ్రామీణులు ఆమె బృందంపై ఎదురు తిరుగుతారు. ఏమాత్రం సహకరించని బృందంలో మార్పును తెస్తూనే... ఆ పల్లెని పులి బారి నుంచి ఎలా కాపాడిందనేదే ‘షేర్నీ’ కథ. ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్‌ కేఎం అభర్ణ జీవిత కథ స్ఫూర్తితో తీసిన ఈ సినిమాలో విద్యాబాలన్‌ ప్రధాన పాత్ర పోషించింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఎన్నో ప్రశ్నలనీ రేకెత్తించింది. మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళుతున్నారని ఆనందించేలోపు... పురుషాధిక్య రంగంలో ఒక మహిళ మనుగడ ఎంత కష్టమన్న విషయాన్ని ఎత్తి చూపింది. ఒక మహిళ ఉద్యోగినిగా కష్టపడుతున్నా, అది ఎంత పెద్ద హోదా అయినా ఇంట్లో ఆమె పనికి విలువ తక్కువే. సినిమాలో అవన్నీ దాటుకొని హీరోయిన్‌, నిజమైన కథలో అభర్ణ తమని తాము నిరూపించుకున్నారు. మనమూ వాటిని దాటుకొని విజయ పథాన సాగాలన్న స్ఫూర్తిని అందుకుందామా మరి?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్