వ్యర్థాలకు విలువ తెద్దాం!

ఇంట్లో పాతవి, వాడని వస్తువులు చాలానే ఉంటాయి. వాటిని చక్కగా వినియోగించాలంటే... మనసు పెట్టి ఆలోచించాలి. అలాంటివే ఇవన్నీ... కాస్త సమయం కేటాయించండి. చక్కగా ఉపయోగపడతాయి.

Published : 04 Jul 2021 01:16 IST

ఇంట్లో పాతవి, వాడని వస్తువులు చాలానే ఉంటాయి. వాటిని చక్కగా వినియోగించాలంటే... మనసు పెట్టి ఆలోచించాలి. అలాంటివే ఇవన్నీ... కాస్త సమయం కేటాయించండి. చక్కగా ఉపయోగపడతాయి.

వాడేసిన కూల్‌డ్రింక్‌, నీళ్ల సీసాలను పారేయకండి. వాటిపై భాగం కత్తిరించి పెయింట్‌ వేస్తే పూలవాజు, కుండీ, పెన్‌ స్టాండ్‌... ఇలా చాలా రకాలుగా వాడొచ్చు. రబ్బర్లు, పెన్నులు, పెన్సిళ్లు, హెయిర్‌పిన్నులు... వంటివి వేసుకోవడానికి ఉపయోగించొచ్చు.

* రంగు పోయిందని, బిగుతుగా అయిందని వేసుకోకుండా పక్కన పెట్టిన జీన్స్‌ ప్యాంట్‌ జేబుల్ని కత్తిరించి పెట్టుకోండి. వాటిని సెల్‌ఫోన్‌, హ్యాండ్‌ పౌచ్‌లుగా తయారు చేసుకోవచ్చు. వీటిమీద కుట్లు అల్లికలతో అందంగా చేతి పనిచేస్తే ట్రెండీలుక్‌తో ఆకట్టుకుంటాయి.

* పాత చీరలు చిరిగిపోయినప్పుడు పారేయక్కర్లేదు. వాటితో డోర్‌మ్యాట్‌లు తయారు చేసుకోవచ్చు. రెండు మూడు పొరలుగా వేసి కుడితే... కిచెన్‌లోని వస్తువులను, సీసాలను, ఫ్రిజ్‌ వంటి వాటిని దుమ్ము తుడవడానికి సౌకర్యంగా ఉంటాయి.

* వంటింట్లో బకెట్లు, బాణలి... ఇతరత్రా పాత్రలకు రంధ్రం పడితే ఇక అవి నిరుపయోగమే అనుకొంటారు చాలా మంది. ఈ సామగ్రిలో మట్టి నింపి మొక్కలు నాటితే పూలకుండీల్లా చూడ్డానికి బాగుంటాయి. కొత్తిమీర, పుదీనా, మెంతికూర వంటివి వేస్తే వంటకాల్లో తాజాగా వాడుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్