నట్టింట దసరా సందడి...

ఈ శరన్నవరాత్రి పండగ శోభను ఇల్లంతా నింపేయాలంటే చిన్నచిన్న చిట్కాలను పాటిస్తే చాలు.

Updated : 15 Oct 2021 05:59 IST

ఈ శరన్నవరాత్రి పండగశోభను ఇల్లంతా నింపేయాలంటే చిన్నచిన్న చిట్కాలను పాటిస్తే చాలు.

* రంగు రంగుల ఊలుతో తయారుచేసిన వాల్‌హ్యాంగింగ్స్‌ను గది గోడల వర్ణానికి తగ్గట్లుగా ఎంచుకుని వేలాడేస్తే చాలు. ఏ గదినైనా ఇవి ఆకర్షణీయంగా మార్చేస్తాయి.

* గుమ్మానికి తాజాపూల తోరణాలు పండగ కళను తెస్తాయి. నీ వృథాగా ఉండే పాత ట్రేలకు రంగు వేసి... ఆపై పూలతలు, ముగ్గులు వంటి వాటితో పెయింట్‌ చేస్తే అందమైన పూజా పళ్లాలుగా మారిపోతాయి. ఇలా అమ్మవారి నుంచే పీటలపైనా చేయొచ్చు.

* పాత జాడీలను ఓ మూలగా పెట్టి పూలు, ఆకులతో దాన్ని ఫ్లవర్‌ వాజులా తీర్చిదిద్దండి.

* గది మధ్యలో బంతి, చామంతి, జెర్బరా వంటిపూలతో రంగవల్లులు వేస్తే సరి. పొడవుగా ఉండే దీపపు సమ్మెలకు పూలమాలలు చుడితే...కళగా ఉంటాయి.

* పరిమళాలు వెదజల్లే పూలతో నింపిన ఉర్లిని ఇంటిమధ్యలో పెట్టండి...నవరాత్రి శోభంతా మీ ఇంట్లోనే కనిపిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్