నీళ్ల మొక్కల్ని పెంచేద్దామా?

మీకు మొక్కలు పెంచడమంటే సరదానా! కానీ ఆ మట్టీ అవీ మనవల్ల కాదులే అనుకున్నారా? అయితే నీళ్లలో పెరిగే మొక్కల్ని ఎంచుకోండి.నీళ్లలో మొక్కల్ని పెంచడాన్ని హైడ్రోఫోనిక్‌ ఫార్మింగ్‌ అంటారు.

Updated : 29 Dec 2021 05:24 IST

మీకు మొక్కలు పెంచడమంటే సరదానా! కానీ ఆ మట్టీ అవీ మనవల్ల కాదులే అనుకున్నారా? అయితే నీళ్లలో పెరిగే మొక్కల్ని ఎంచుకోండి.

నీళ్లలో మొక్కల్ని పెంచడాన్ని హైడ్రోఫోనిక్‌ ఫార్మింగ్‌ అంటారు. దీంట్లో రోజూ నీళ్లు పోయడం, కుండీల్లోంచి మట్టి కారడం, పురుగు చేరడం, చీడపట్టడం లాంటి ఇబ్బందులుండవు. ఇందుకోసం అలోవెరా, మనీ ప్లాంట్‌, రబ్బర్‌ మొక్క, స్పైడర్‌ ప్లాంట్‌, లిల్లీ, డెవిల్స్‌ ఐవి లాంటి మొక్కల్ని ఎంచుకోవాలి. పుదీనా, కొత్తిమీర లాంటి మొక్కలూ నీళ్లలో పెరుగుతాయి. ముందుగా మొక్కల వేర్లకున్న మట్టిని కడిగి నీళ్ల సీసాలోకి దింపాలి.

* అప్పుడే తెచ్చిన మొక్కలయితే వేళ్లూనుకునేదాకా వారానికోసారి నీటిని మార్చాలి. నీళ్లకు బదులు ఫెర్టిలైజర్‌ ద్రవాన్ని వాడొచ్చు. తర్వాత నెలకోసారి నీళ్లు మారిస్తే సరిపోతుంది. ఈ మొక్కల్ని మరీ ఎండ సోకే లేదా చల్లని ప్రదేశాల్లో కాకుండా సమ ఉష్ణోగ్రత వద్దే ఉంచాలి. నీళ్లలో చిన్న బొగ్గుముక్క వేస్తే నాచు పట్టదు. వేళ్లకు గాలి అందుతుంది. ఈ మొక్కల పెరుగుదలకు లిక్విడ్‌ న్యూట్రియంట్స్‌ కూడా వేస్తారు.

* నేలమీద పెరిగే మొక్కల్లా ఇవి స్థిరంగా, దృఢంగా ఉండవు కనుక జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆకులూ కొమ్మలూ తుంచితే మొక్క చనిపోయే ప్రమాదముంది.

* ఇంటి ముందు చిన్న కొలను ఏర్పాటు చేసుకుంటే కలువ, తామర మొక్కలు వేయవచ్చు. తరచూ నీటిని మార్చడం, ఎయిర్‌ ఫ్రెష్‌నర్‌ స్ప్రే చేయడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే నీచు వాసన వస్తుంది. పెద్దగా స్థలం లేని వాళ్లు చిన్న టబ్స్‌లో పెంచుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్