ఆకే.. గ్లాసు

పూర్వం రోజుల్లో నీళ్లు తాగడానికి పత్రాలను వాడే వారట. అదేనండీ ఆకులను దొన్నెలా చేసి అందులో నీళ్లు నింపి తాగడం అన్నమాట. మొహం కడుక్కునేటప్పుడు, బ్రష్‌ చేసేటప్పుడు నోట్లో నీళ్లు పోసుకోవడానికి చేతినే చిన్న

Published : 10 Apr 2022 02:05 IST

పూర్వం రోజుల్లో నీళ్లు తాగడానికి పత్రాలను వాడే వారట. అదేనండీ ఆకులను దొన్నెలా చేసి అందులో నీళ్లు నింపి తాగడం అన్నమాట. మొహం కడుక్కునేటప్పుడు, బ్రష్‌ చేసేటప్పుడు నోట్లో నీళ్లు పోసుకోవడానికి చేతినే చిన్న దొన్నెలా చేసి నీళ్లు పడతాం. తీరా నోటి దాకా తెచ్చే సరికి నీళ్లు పావు వంతు కూడా ఉండవు. ఒక్కోసారి బయట పిల్లలకు ఏదైనా తాగించాలనుకుంటే సమయానికి గ్లాసు దొరకదు. ఇంట్లో కూడా పిల్లలు పాలు తాగడానికి మొరాయిస్తారు... అలాంటి సందర్భాల్లో ఈ కొత్తరకం సిలికాన్‌ కప్పు చక్కగా ఉపయోగపడుతుంది. ఆకు ఆకారంలో... మృదువుగా, చిన్నగా ఉండే దీన్ని బ్యాగు, పర్సుల్లోనూ పెట్టేసుకోవచ్చు. రకరకాల రంగుల్లో దొరుకుతున్నాయి. శుభ్రం చేయడమూ సులువే. ఇష్టమైన వారికి కానుకగానూ ఇవ్వొచ్చు. బాగుంది కదూ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్