పట్టుచీరపై మరకా?

ఈ మాసంలో పట్టుచీరలన్నీ బయటికొచ్చేస్తాయి! కట్టుకున్నప్పుడు హుందాగా ఉన్నా.. వీటి జాగ్రత్త విషయంలో తెలియని భయం. పూజలోనో, వంట చేసేప్పుడు నూనె పడటం, కూర, టీ, కాఫీ మరకలు.. ఎంత జాగ్రత్తగా ఉన్నా పలకరిస్తుంటాయి. తొందరపడి ఏదైనా చేస్తే చీరే పాడవ్వొచ్చు. అలా కాకుండా ఉండాలంటే...

Published : 05 Aug 2022 00:36 IST

ఈ మాసంలో పట్టుచీరలన్నీ బయటికొచ్చేస్తాయి! కట్టుకున్నప్పుడు హుందాగా ఉన్నా.. వీటి జాగ్రత్త విషయంలో తెలియని భయం. పూజలోనో, వంట చేసేప్పుడు నూనె పడటం, కూర, టీ, కాఫీ మరకలు.. ఎంత జాగ్రత్తగా ఉన్నా పలకరిస్తుంటాయి. తొందరపడి ఏదైనా చేస్తే చీరే పాడవ్వొచ్చు. అలా కాకుండా ఉండాలంటే...

పట్టుచీరల్ని నీటిలో నానబెట్టడం, వాషింగ్‌ మెషిన్‌లో ఉతకడం వంటివి వద్దు. డ్రైక్లీనింగ్‌కే ఇవ్వాలి. నూనె మరకలేమైనా పడితే డిటర్జెంట్‌తో ఉతికేయొద్దు. ముందు దానిపై కాస్త పౌడర్‌ చల్లండి. పౌడర్‌ నూనెను పీల్చుకున్నాక చల్లటి నీటిలో ముంచిన దూదితో రుద్దితే సరిపోతుంది. అయినా మరక ఇంకా కనిపిస్తోంటే.. అర మగ్గు నీటిలో పిల్లల షాంపూ కలిపి ఆ నీటిలో ముంచిన వస్త్రం లేదా దూదితో రుద్ది చూడండి.

కూర లాంటి మరకలు పడి ఎండిపోతే ఓ పట్టాన వదలవు. ముందు చల్లటి నీటిలో ముంచి పిండిన స్పాంజితో నెమ్మదిగా అద్దండి. మరక ఆనవాళ్లు కనిపిస్తోంటే సమ పాళ్లలో నీరు, వెనిగర్‌ తీసుకోండి. దానిలో ముంచిన దూదితో అద్దండి. కానీ దీంతో కొన్ని చీరలు రంగుపోయే ప్రమాదముంది. అందుకే కట్టు చెంగు దగ్గర కొద్దిగా అద్ది 5-10 నిమిషాలు వేచి చూడండి. సమస్య లేదన్నాకే ప్రయత్నించండి.

కొన్ని మొండి మరకలకు వెనిగర్‌ మిశ్రమం సరిపోదు. అలాంటప్పుడు గ్లాసు నీళ్లలో స్పూను డిష్‌ వాషింగ్‌ సొల్యూషన్‌ను కలిపి దాంతో రుద్ది చూడొచ్చు.

చీర విప్పేయగానే కుర్చీలో కుప్పగా పడేయొద్దు. జరీ దెబ్బతింటుంది. మెటల్‌ కాకుండా తాడు లాంటి దానిపై ఆరేయండి. కట్టిన ప్రతిసారీ డ్రైక్లీనింగ్‌కి ఇవ్వొద్దు. మూడు, నాలుగుసార్లు కట్టాకే ఇవ్వడం మేలు. నేరుగా ఎండ పడే చోటా పట్టుచీరల్ని ఆరేయొద్దు. రంగును కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే నీడలోనే ఆరబెట్టాలి. ఆపై రోలింగ్‌కి ఇచ్చి పేపర్‌ లేదా వస్త్రంలో ఉంచి భద్రపరిస్తే సరిపోతుంది. నేరుగా ఇస్త్రీ చేయడమూ మంచిది కాదు. చీరమీద ఏదైనా వస్త్రం వేసి, దాని మీద రుద్దాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్