చేతులకు హాయిగా...

ఉల్లిపాయలు తరిగేటప్పుడు కొంత మందికి కన్నీళ్లు వస్తుంటాయి. అలాంటప్పుడు వాటికున్న పొట్టు, తొడిమలు తీసేసి పది నిమిషాలు నీటిలో ఉంచి తర్వాత తరగండి. సమస్య ఉండదు.

Published : 03 Jun 2023 00:06 IST

* ఉల్లిపాయలు తరిగేటప్పుడు కొంత మందికి కన్నీళ్లు వస్తుంటాయి. అలాంటప్పుడు వాటికున్న పొట్టు, తొడిమలు తీసేసి పది నిమిషాలు నీటిలో ఉంచి తర్వాత తరగండి. సమస్య ఉండదు.

* కొంత మందికి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు తరిగితే చేతులు మంటపుడుతుంటాయి. దీనిని తగ్గించడానికి పంచదార కలిపిన నీటితో చేతులు కడిగితే సరి...

* దొండకాయలు కోస్తే చేతులు నల్లగా మారుతుంటాయి. అలా జరగకుండా ఉండాలంటే తరిగే ముందు చేతులకు కాస్త కొబ్బరి నూనె రాసుకోవాలి.

* కూర అరటికాయను కట్‌చేస్తుంటే చేతులకు జిగురు అంటుకుని, నల్లగా మారి దురద పెడుతుంటాయి. వాటిని కోసిన తర్వాత ఉప్పు నీటితో చేతులు కడుక్కుంటే సరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని