సూదీ-దారం అక్కర్లేదిక!

నచ్చి కట్టుకున్న పట్టు చీర.. ప్రయాణంలోనే పిగిలిపోతే! వేడుకలో తళుక్కున మెరవాలని వేసుకున్న లెహెంగా అకస్మాత్తుగా చిరిగితే...

Published : 05 Aug 2023 00:15 IST

నచ్చి కట్టుకున్న పట్టు చీర.. ప్రయాణంలోనే పిగిలిపోతే! వేడుకలో తళుక్కున మెరవాలని వేసుకున్న లెహెంగా అకస్మాత్తుగా చిరిగితే...

బాధతో మనసు చివుక్కుమంటుంది. అయితే, అది పెద్దది కాకూడదన్నా, అందరిలోనూ అభాసుపాలు అవకూడదన్నా... తక్షణం దాన్ని దాచేయాల్సిందే. అలాగని పిన్నులు పెడితే బాగోదు. సూదీ-దారం అందుబాటులో లేవు.  ఎలా అనుకుంటున్నారా? ఏం ఫరవాలేదు. ఇకముందు మిగిలిన వస్తువులతో పాటు ఈ హెమ్మింగ్‌ టేప్‌నీ బ్యాగులో ఉంచుకోండి. ఈ ఫ్యాబ్రిక్‌ టేపు డబుల్‌సైడ్‌ జిగురుతో చిరుగుని కనిపించ నీయదు. వస్త్రాన్ని అందంగా రోల్‌ చేయాలన్నా, రెండింటిని కలపాలన్నా కూడా ఇది బాగా పనిచేస్తుంది. అయితే, ఇలాంటప్పుడు తక్కువ వేడితో ఫ్యాబ్క్‌ మీద ఐరన్‌ చేస్తే సరి. ఎక్కడా ఎబ్బెట్టుగానూ ఉండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్