తలగడే కాదు... అంతకుమించి!

చిన్నారుల కోసం దిండ్లు ఇప్పుడు కొత్తేమీ కాదు. కానీ... వారు మెచ్చేలా కొన్ని ప్రత్యేకతలు జోడిస్తే? ఏమిటవీ... ఎలా ఉంటాయి అని ఆసక్తిగా ఉందా? అయితే చదివేయండి.

Published : 10 Mar 2024 01:37 IST

చిన్నారుల కోసం దిండ్లు ఇప్పుడు కొత్తేమీ కాదు. కానీ... వారు మెచ్చేలా కొన్ని ప్రత్యేకతలు జోడిస్తే? ఏమిటవీ... ఎలా ఉంటాయి అని ఆసక్తిగా ఉందా? అయితే చదివేయండి.

నిద్రపోయే ముందు...

 ‘ప్లీజ్‌... ఒక్క కథ’... వినిపించమనో, చదువుతామనో గోముగా పిల్లలు కోరడం మనకు మామూలే! చదివితేనే సంతృప్తి అనుకునే చిన్నారులకోసం వచ్చినవే ఇవి. వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా దిండులోనే నచ్చిన పుస్తకాన్ని ఉంచుకోవచ్చు. మెత్తని కుషన్‌తోపాటు ఈ తలగడకు బయటివైపు వస్త్రంతో కుట్టిన చిన్నచిన్న అరలుంటాయి. వీటిలో పిల్లలకెంతో ఇష్టమైన రెండు మూడు కథల పుస్తకాలు, వారికి నచ్చే బొమ్మలుంచొచ్చు. రోజంతా అలసి పక్కపైకి చేరుకున్న పిల్లలకు చేతికందే దూరంలో ఈ దిండునుంచితే చాలు. నచ్చిన కథను చదివి, మెత్తని బొమ్మను హత్తుకుని మరీ కంటి నిండా నిద్రపోతారు. సోఫా, కుర్చీల్లో కూడా పుస్తకాలుంచిన ఈ దిండ్లను సర్దొచ్చు.

 


ప్రయాణంలో..

ప్రయాణాల ప్రత్యేకంగానూ పిల్లల కోసం ‘ట్రావెల్‌ పిల్లో’లు వస్తున్నాయి. వీటిని ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లేలా హ్యాండిళ్లతో తయారు చేస్తున్నారు. వాళ్ల చిట్టి సూట్‌కేస్‌ హ్యాండిల్‌కి తగిలించుకొని ఎంచక్కా తీసుకెళ్లొచ్చు. వీటిల్లోనూ తమకిష్టమైన బొమ్మలు, పుస్తకాలను సర్దుకునే వీలుంటుంది. నచ్చినపుడు కథలు చదువుతూ...అలసిపోతే మెత్తని ఆ దిండుపై విశ్రాంతి తీసుకుంటారు.


బొమ్మల దిండ్లు...

కొందరు పిల్లలకు బొమ్మలతో ఉండే అనుబంధమే వేరు. అవి లేనిదే ఒక్కోసారి నిద్ర కూడా పోరు. సర్దుతూ పొరపాటున ఎక్కడైనా పెట్టామో ఇక అంతే సంగతులు. అలాంటివారికి ఈ తలగడ ప్రత్యేకం. దిండుకు కొన్ని చిన్న అరలు జోడించి ఉంటాయి. వాళ్లు మెచ్చే బొమ్మలను వాటిల్లో ఉంచితే చాలు. వాటితో ఆడుకొని, అదే దిండుపై తలవాల్చి నిద్రపోతారు. భలేగున్నాయి కదూ... ఈ తలగడలు. మరింకెందుకాలస్యం.. మీ పిల్లలకూ తెచ్చేయండి.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్