మీ కూరల్లో ఏ ఉప్పు వాడుతున్నారు?

ఎంత గొప్ప వంట చేసినా చిటికెడు ఉప్పు వేయకపోతే దాన్ని రుచి చూడలేం. అయితే, మనం ఒకప్పుడు కల్లుప్పునీ, ఈ మధ్యకాలంలో అయొడైజ్డ్‌ సాల్ట్‌నీ ఎక్కువ వాడుతున్నాం.

Published : 12 Mar 2024 01:20 IST

ఎంత గొప్ప వంట చేసినా చిటికెడు ఉప్పు వేయకపోతే దాన్ని రుచి చూడలేం. అయితే, మనం ఒకప్పుడు కల్లుప్పునీ, ఈ మధ్యకాలంలో అయొడైజ్డ్‌ సాల్ట్‌నీ ఎక్కువ వాడుతున్నాం. కానీ, ఇందులోనూ బోలెడు రకాలున్నాయని తెలుసా?

రాతి ఉప్పు: హిమాలయన్‌ పింక్‌ సాల్ట్‌... లేత గులాబీ రంగులో కనిపించే ఇందులో ఐరన్‌ ఆక్సైడ్‌ ఎక్కువగా ఉంటుంది. అందుకే దీనికా ఛాయ వచ్చింది. సాధారణ ఉప్పులో కంటే ఇందులో సోడియం తక్కువ. ఉప్పు తక్కువ వాడాలనుకునేవారు దీన్ని ఎంచుకుంటే మంచిది. సూపులు, సలాడ్లలో ఎక్కువగా వినియోగిస్తారు. 

కోషెర్‌ సాల్ట్‌:.  ముతకగా ఉండే ఈ ఉప్పుతో ఆహార పదార్థాలు నిల్వ చేస్తారు. కాక్‌టెయిల్‌ గ్లాసుల చుట్టూ పూయడానికీ వాడతారు. వేపుళ్లూ, గ్రిల్‌ వంటకాలకు ముందు చికెన్‌, కూరగాయలు వంటివాటిని  మారినేట్‌ చేసేందుకూ దీన్ని ఎక్కువగా వినియోగిస్తారు.

సెల్జిక్‌ సాల్ట్‌: లేత బూడిద రంగులో ఉండే ఈ ఉప్పులో తేమ ఎక్కువ. సాధారణ ఉప్పుతో పోల్చితే దీనిలో ఖనిజాల గాఢత. సోడియం పాళ్లు తక్కువే. రుచినీ పెంచుతుంది.

నల్ల ఉప్పు: దీనిలో ఇనుము, ఇతర ఖనిజాలు ఉండటం వల్ల దీనికా పేరు వచ్చింది. చాట్‌, పానీపూరి పదార్థాల తయారీలో ఎక్కువగా వాడతారు.

సీ సాల్ట్‌:  ఇందులో ఖనిజాల మోతాదు ఎక్కువ. దీన్ని సాస్‌లు, మసాలా, గ్రేవీ కూరల్లో ఎక్కువగా వాడతారు. టాపింగ్‌, డ్రెస్సింగ్‌ల్లోనూ వినియోగిస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్