కుదిరే సమయం... అదిరే వంటలు...

ఎంత బిజీ జీవితాలైనా... పిల్లలకూ మనకూ కావాల్సినవి వండుకోవడం అయితే తప్పదు కదా. అయితే వంటల్ని తక్కువ సమయంలోనే సిద్ధం చేసుకునే వస్తువులుంటే? ఈ పరికరాలపై ఓ లుక్కేయండి.

Published : 13 Mar 2024 01:34 IST

స్మార్ట్‌ కిచెన్‌

ఎంత బిజీ జీవితాలైనా... పిల్లలకూ మనకూ కావాల్సినవి వండుకోవడం అయితే తప్పదు కదా. అయితే వంటల్ని తక్కువ సమయంలోనే సిద్ధం చేసుకునే వస్తువులుంటే? ఈ పరికరాలపై ఓ లుక్కేయండి.

క్షణాల్లో కోరేద్దాం...

కొబ్బరి వేస్తే వంటకు వచ్చే రుచే వేరు కదా! కానీ దాన్ని తురుము తీయాలంటేనే చేతులు నొప్పి పుడతాయి. పైగా సమయమూ ఎక్కువ తీసుకుంటుంది. అలాగని మిక్సీలో వేసి వేద్దాంలే అనుకుంటేనేమో ఆ రుచి రాదు. అలాంటప్పుడు ఈ కోకోనట్‌ స్క్రేపర్‌ను తెచ్చేసుకోండి. దీన్ని ఉపయోగించడమూ తేలికే. ఎందుకంటే ఇందులో ఉండే గిన్నెకు స్క్రాపర్‌ను అటాచ్‌ చేసుకోవాలి. మన మిక్సీ జార్‌లానే ఉండే ఆ గిన్నెను మిక్సీపై ఉంచి ఆన్‌ చేసుకుంటే, స్క్రాపర్‌ తిరుగుతూ ఉంటుంది. దానిపై కొబ్బరి చిప్పను ఏటవాలుగా ఉంచితే చాలు. క్షణాల్లో కొబ్బరి తురుము వచ్చేస్తుంది. ఒకవేళ మనం జ్యూస్‌ లాంటిది తయారుచేసుకోవాలంటే ఆ స్క్రాపర్‌ను తొలగించి, అందులో వచ్చిన సిట్రస్‌ జ్యూసర్‌ అటాచ్‌మెంట్‌ను పెట్టుకోవచ్చు. నిమ్మ, నారింజ, బత్తాయి... ఇలా పండ్ల రసానైన్నా క్షణాలో చేసేస్తుంది. తక్కువ శ్రమతో పనులన్నీ చకచకా అయిపోతాయి.


మ్యాజిక్‌ చేసేద్దాం..!

ఈ బిజీ జీవితాల్లో నిదానంగా వండుకునే సమయం ఎక్కడిది? అందుకే వంటను మరింత సులభం చేసేందుకు వచ్చిందే ఈ ఎలక్ట్రిక్‌ మ్యాజిక్‌ పాన్‌. ఇందులో రైస్‌, జావ, సూప్‌, నూడుల్స్‌... లాంటి ఆరు రకాల మోడ్‌లు ఉంటాయి. వంటకు కావాల్సిన పదార్థాలన్నింటినీ తగు పరిమాణాల్లో తీసుకుని, అడుగున ఉండే గిన్నెలో వేసేసి, కుకింగ్‌ టైమ్‌, ఉష్ణోగ్రతలనూ సెట్‌ చేసుకుంటే చాలు. చిటికెలో తయారైపోతుంది. ఇక దానిపై ఉండే మరో స్టీమింగ్‌ పాన్‌లో ఎగ్స్‌, మోమోస్‌లాంటి వాటినీ ఉడికించుకోవచ్చు. సెరామిక్‌ నాన్‌స్టిక్‌ పాన్‌లు కావడంతో నూనె లేకుండా, లేదా తక్కువ నూనెతో కూడా మనం వండుకోవచ్చు. అంటే ఒక్క పాన్‌తో బోలెడు వంటలు చేసుకోవచ్చన్నమాట!


కొలత ఏదైనా... పరికరం ఒక్కటే!

ఎంత మంచి ఆహారం పెట్టినా పిల్లలు వెరైటీ వంటల్నే ఇష్టపడతారు కదా! అలాంటప్పుడు వారికోసం ఇంట్లోనే ఏదైనా చేయాలిగా...  అందులో భాగంగా బేకింగ్‌ ఐటమ్స్‌ చేసేటప్పుడు మాత్రం మరింత పక్కాగా కొలతలు ఉండాల్సిందే. అప్పుడే అనుకున్న రీతిలో వస్తాయి. అందుకోసం రకరకాల సైజుల్లో గిన్నెలను కొనాల్సిన పనిలేకుండా ఈ ‘డిజిటల్‌ మెజరింగ్‌ కప్‌’ భలేగా ఉపయోగపడుతుంది. ఇందులో పౌండ్లు, ఔన్సులు, గ్రాముల్లో మనం బరువుని సెట్‌ చేసుకోవచ్చు. నీళ్లు, పాలు, పంచదార, పిండి వంటివి ఏవైనా సరే ఎంచక్కా ఒకే గిన్నెలో కొలుచుకోవచ్చు. డిజిటల్‌ పరికరం కాబట్టి, కొలతల్లో తేడా రాదు. హడావుడి లేకుండా పిల్లలకు కావాల్సిన బేకరీ ఐటమ్స్‌ చేసిపెట్టొచ్చు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్