ఆ చోటు గుర్తిస్తే చాలు...

ఒకేసారి ఇంటికి కావాల్సిన వస్తువులు హోల్‌సేల్‌గా కొంటుంటాం. దీంతో ఇల్లంతా సామాన్లతో నిండిపోయి ఇరుకు అనిపిస్తుంది. అయినా... ఇంటిని విశాలంగా కనిపించేలా చేయొచ్చు.

Updated : 18 Mar 2024 01:50 IST

ఒకేసారి ఇంటికి కావాల్సిన వస్తువులు హోల్‌సేల్‌గా కొంటుంటాం. దీంతో ఇల్లంతా సామాన్లతో నిండిపోయి ఇరుకు అనిపిస్తుంది. అయినా... ఇంటిని విశాలంగా కనిపించేలా చేయొచ్చు. ఇంట్లో ఉండే కొన్ని చోట్లను వృథాకాకుండా వినియోగిస్తే చాలు. 

డూప్లెక్స్‌ ఇళ్లల్లో పై అంతస్తుకి వెళ్లడానికి ఉండే మెట్ల కింద స్థలాన్ని ఖాళీగా వదలకూడదు. ఆ చోటు ఎత్తుబట్టి ఆ ఖాళీలో గోడకు మూడు నాలుగు అలమరలొచ్చేలా ఏర్పాటు చేయాలి. వీటిలో పిల్లల బొమ్మలు, ఇంటికి ఉపయోగించే టూల్స్‌, స్టేషనరీ బాక్సులు, అత్యవసరానికి వెంటనే తీసుకోగలిగేలా సర్దాలి. వ్యర్థంగా ఉండే ఈ చోటును ఉపయోగకరంగా మార్చితే చాలు. అలాగే ఫర్నిచర్‌లోనే సామాన్లుంచేలా సౌకర్యాలున్నాయిప్పుడు. సోఫా, మంచం వంటివాటికి సొరుగులుండేలా తీసుకుంటే వాటిలో దుప్పట్లూ, పాత దుస్తులూ, అదనపు తలగడలూ, బొంతలు వంటివన్నీ పెట్టేయొచ్చు. వీటికంటూ ప్రత్యేక బీరువా అవసరం ఉండదు.

సీలింగ్‌ కింద..

గతంలో సీలింగ్‌ కిందగా గదిలో ఓ వైపుగా వచ్చేలా అటక ఉండేది. ఫాల్స్‌ సీలింగ్‌ వచ్చాక ఆ ప్రాంతంలో సామాన్లనుంచడానికి ఇప్పుడు వీలుండటం లేదు. వంటింటి అలమరలపై సీలింగ్‌కు కిందగా రెండు అరలొచ్చేలా పొడవైన షెల్ఫ్‌ ఏర్పాటు చేయాలి. ఎప్పుడోకానీ వాడని పెద్ద పాత్రలు, హోల్‌సేల్‌గా తీసుకునే వంటింటి సరకులను ఇందులో సర్దేయొచ్చు. వంటిల్లు ఇరుకుగా అనిపించదు.

కిచెన్‌లో ..

వంటింటి దిమ్మ గోడకు సరిపడా ప్లైవుడ్‌ అటాచ్‌చేసి రంధ్రాలు చేస్తే చాలు. చిన్నచిన్న స్టాండ్స్‌ తగిలించి గరిటెలు, ఫోర్క్స్‌, స్పూన్లు పెట్టుకోవచ్చు. దుంపలు, ఉల్లిపాయలు, అల్లం ఉంచిన బుట్టలను తగిలించొచ్చు. అలాగే స్నానాలగదిలో  చిన్న అలమర ఉంటే టవల్స్‌, క్లీనింగ్‌ లిక్విడ్స్‌, షేవింగ్‌ సామాను, సోప్స్‌ ఉంచొచ్చు.  

తలుపు వెనుక..

పడకగది తలుపు వెనుక చిన్న స్టాండు అటాచ్‌ చేస్తే మరుసటి రోజు ధరించాల్సిన దుస్తులను ఐరన్‌ చేసి తగిలించేయొచ్చు. అలాగే మ్యాచింగ్‌ బ్యాగ్‌, పాదరక్షలు వంటివి కూడా భద్రపరచొచ్చు. చిన్న అద్దం, దువ్వెన వంటివి ఉంచితే మంచిది. అలాగే ఫ్రిజ్‌ ఉంచిన చోట పక్కగా ఉన్న గోడను చిన్న షెల్ఫ్‌లా మార్చేస్తే లెటర్స్‌, దినపత్రికలు, అత్యవసర బిల్స్‌కు చోటు దొరుకుతుంది.

అడుగున..

వంటింటి క్యాబినెట్స్‌ అడుగున చిన్న సొరుగుల ఏర్పాటు ఉంటే డిష్‌టవల్స్‌, అత్యవసరానికి కావాల్సిన కవర్లు ఉంచొచ్చు. అలాగే సింకు కిందభాగాన్ని ఖాళీగా ఉంచకుండా స్టోరేజ్‌గా మార్చొచ్చు. ఇందులో ఐరన్‌ స్టాండ్స్‌ ఏర్పాటుతో క్లీనింగ్‌ లిక్విడ్స్‌, డిష్‌వాషింగ్‌ సోప్స్‌, టిష్యూ టవల్స్‌ సర్దొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్