ప్రకృతిలా సేదదీరుస్తాయి..!

కొండలు, లోయలు, మైదానాల్లో నడుస్తూ.. మధ్యలో మెత్తని పచ్చికబయళ్లపై కాసేపు విశ్రమిస్తే ఎలా ఉంటుంది? అలసట దూరమై, హాయిగా అనిపిస్తుంది కదూ..! ఈ ఫర్నిచర్‌ కూడా అదే అనుభూతినిస్తుంది.

Published : 25 Mar 2024 01:33 IST

కొండలు, లోయలు, మైదానాల్లో నడుస్తూ.. మధ్యలో మెత్తని పచ్చికబయళ్లపై కాసేపు విశ్రమిస్తే ఎలా ఉంటుంది? అలసట దూరమై, హాయిగా అనిపిస్తుంది కదూ..! ఈ ఫర్నిచర్‌ కూడా అదే అనుభూతినిస్తుంది. రోజంతా పనితో అలసిన శరీరానికి ఇది ప్రకృతిలా దగ్గరకు తీసుకుని సేదదీరుస్తుంది. కిటికీ పక్క లేదా గది మధ్యలో సర్దే పచ్చని సోఫా, బీన్‌బ్యాగు, ఫ్లోర్‌ సీటింగ్‌ లేదా వాలు కుర్చీలాంటిదానిపై కూర్చుంటే చాలు. పచ్చికలో జేరబడ్డామనిపించడం ఖాయం. ప్రకృతికి దగ్గరగా ఉండేలా తయారుచేసిన ఈ మెత్తని ఫర్నిచర్‌కు డిజైనర్లు ఆకుపచ్చని దారాలనే ఉపయోగించడంతో మృదువైన గడ్డి పరకలు ఓ చోట సర్దినట్లుగా సహజత్వం ఉట్టిపడుతుంది.

పాదాలకు: పచ్చగడ్డి పరిచినట్లు అనిపించే లేత, ముదురాకుపచ్చరంగు మ్యాట్స్‌, కార్పెట్లపై అడుగుపెడితే చాలు... పాదాలకు సుతిమెత్తని అనుభూతినిస్తాయి. పచ్చికబయళ్లలో నడిచినంత సౌకర్యాన్నిస్తాయి. ఆకుపచ్చని దారాలతో అల్లిన వీటిని ముందుగది లేదా పడకగదిలో పరిస్తే చాలు. గది అందాన్ని రెట్టింపు చేస్తాయి. వీటి మధ్యలో తెలుపు, లేత పసుపు రంగు దారాలు కలపడంతో గడ్డిలో పూసిన పూలమల్లే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తూ.. భలే అనిపిస్తున్న ఈ ఫర్నిచర్‌ మీకూ నచ్చింది కదూ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్