టాప్‌ల ఎంపికలో తగ్గేదేలే!

ఈతరం అమ్మాయిలు వేసవైనా సరే స్టైల్‌ విషయంలో తగ్గేదేలే అంటున్నారు. మండే ఎండల్లో టాప్స్‌, స్కర్ట్స్‌, షార్ట్స్‌, జీన్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. వీటితో పాటు రకరకాల టాప్‌లకు కూడా. మరి మీ వార్డ్‌రోబ్‌లో ఈ టాప్స్‌ ఉన్నాయా?

Updated : 31 Mar 2022 02:08 IST

ఈతరం అమ్మాయిలు వేసవైనా సరే స్టైల్‌ విషయంలో తగ్గేదేలే అంటున్నారు. మండే ఎండల్లో టాప్స్‌, స్కర్ట్స్‌, షార్ట్స్‌, జీన్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. వీటితో పాటు రకరకాల టాప్‌లకు కూడా. మరి మీ వార్డ్‌రోబ్‌లో ఈ టాప్స్‌ ఉన్నాయా?


షీర్స్‌... కాస్త పారదర్శకంగా ఉండే ఈ టాప్స్‌ ఇప్పుడు ట్రెండ్‌. వీటిని ట్యూబ్‌ టాప్‌ లేదా బ్రాలెట్‌తో జత చేసి వేసుకోవచ్చు. పార్టీలకు చక్కగా నప్పుతాయి. వీటిలోనూ బోలెడు డిజైన్‌లున్నాయి.  


క్రాప్‌ టాప్స్‌.. ఈ కాలంలో వీటికి మించిన చక్కని ఎంపిక మరొకటి లేదు. స్కర్ట్‌, జీన్స్‌, ప్యాంట్‌... వీటిమీదకైనా చక్కగా నప్పుతుంది. వివిధ రకాల సందర్భాల్లోనూ వేసుకోవచ్చు.


రఫెల్స్‌... మిమ్మల్ని స్టైలిష్‌గా మారుస్తాయి. సన్నటి అమ్మాయిలకు చక్కగా నప్పుతాయి. జీన్స్‌ల మీదకు సరిగ్గా సరిపోతాయి.


స్లీవ్‌లెస్‌... ఇవి చాలా చాలా సౌకర్యంగా ఉంటాయి. వేసవి ఉక్కపోత మిమ్మల్ని బాధించదు.


హై-లో టాప్‌...స్టైల్‌, సౌకర్యం రెండింటినీ అందిస్తుందిది.  జీన్స్‌తో వేసుకుంటే సరి. క్యాజువల్‌వేర్‌గానూ బాగుంటుంది.


ఓవర్‌ సైజ్డ్‌ టీ షర్ట్‌... వేసవిలో చాలా సౌకర్యంగా ఉంటుంది. దీన్ని షార్ట్స్‌, రాగ్డ్‌ జీన్స్‌కు జతగా వేసుకోవచ్చు. ఈ టీ షర్ట్‌ మీకు ఫంకీ లుక్‌ను ఇస్తుంది.


లైట్‌ కలర్‌ కాటన్‌ షర్ట్‌... దీన్ని ప్యాంట్‌, జీన్స్‌తో వేసుకోవచ్చు.  ఈ కాలంలో చాలా సౌకర్యంగా ఉంటుంది. లేత రంగులు ఎంచుకుంటే బాగుంటుంది. మరెందుకాలస్యం రకానికి ఒకటి చొప్పున మీ వార్డ్‌ రోబ్‌లో చోటివ్వండి.


కఫ్తాన్స్‌... అన్ని వయసుల వారూ వీటిని ఎంచుకోవచ్చు. జీన్స్‌, పలాజోతో వేసుకుంటే ప్రత్యేకంగా కనిపిస్తారు. ఇవి రకరకాల డిజైన్‌లలో అందుబాటులో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్