పట్టుచీరను ప్రత్యేకంగా..

శుభకార్యాలకు వెళ్లాలన్నా, ప్రత్యేక సందర్భం, పండుగలకైనా ధరించేది పట్టుచీరే. వీటి ఖరీదు వేల నుంచి లక్షల్లోనే ఉంటుంది. నచ్చిన పట్టుచీర కొనుక్కోగానే సరిపోదు, వాటిని జాగ్రత్తగా పరిరక్షిస్తే దశాబ్దాల తరబడి ఉపయోగించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఇందుకు కొన్ని చిట్కాలూ.. చెబుతున్నారు.

Updated : 03 Jul 2022 06:47 IST

శుభకార్యాలకు వెళ్లాలన్నా, ప్రత్యేక సందర్భం, పండుగలకైనా ధరించేది పట్టుచీరే. వీటి ఖరీదు వేల నుంచి లక్షల్లోనే ఉంటుంది. నచ్చిన పట్టుచీర కొనుక్కోగానే సరిపోదు, వాటిని జాగ్రత్తగా పరిరక్షిస్తే దశాబ్దాల తరబడి ఉపయోగించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఇందుకు కొన్ని చిట్కాలూ.. చెబుతున్నారు.

టీ, కాఫీ, ఐస్‌క్రీం లేదా నూనె మరకలు పడినప్పుడు వెంటనే పట్టుచీరలో ఆ ప్రాంతాన్ని నీటితో శుభ్రపరచడం, వేడినీటిలో లేదా వాషింగ్‌ మెషిన్‌లో వేయడం లాంటివి చేయొద్దు. మరక ఆరాక గోరువెచ్చని నీటిలో మైల్డ్‌ షాంపూ లేదా బాడీ సోప్‌ కలిపి అందులో మరక పడిన ప్రాంతం మాత్రం తడిసేలా అయిదు నిమిషాలు నాననివ్వాలి. ఆ తర్వాత బ్రష్‌తో కాకుండా చేతితోనే శుభ్రపరిచి నీటిలో ముంచి తీయాలి. చీరను పిండకూడదు. పిండితే ముడతలు ఏర్పడి ఇస్త్రీ చేసినా అవి పోవు. ఉతికిన వెంటనే మొదట మెత్తని వస్త్రంతో కలిపి పట్టుచీరను మృదువుగా రోల్‌ చేయాలి. నాలుగైదు నిమిషాలకు చీరలోని తడి ఆరిన తర్వాత నీడలో లేదా ఫ్యాన్‌ గాలిలో ఆరనివ్వాలి. దీంతో మరకలు దూరమవడమే కాకుండా పట్టుచీర ఎప్పటిలా కొత్తదానిలా కనిపిస్తుంది. దీనిపై మృదువైన కాటన్‌ వస్త్రం వేసి తక్కువ వేడితో ఇస్త్రీ చేస్తే చాలు.

మడిచేటప్పుడు..
వార్డ్‌రోబ్‌లో మిగతా చీరలతో కలిపి పట్టుచీరలను ఉంచకూడదు. ప్రత్యేక మస్లిన్‌ క్లాత్‌ సంచిలో విడిగా భద్రపరచాలి. వీటికోసం వార్డ్‌రోబ్‌లో ప్రత్యేకంగా అర కేటాయించడం మంచిది. వార్డ్‌బోబ్‌లో స్థలం లేకపోతే మార్కెట్‌లో ప్రత్యేక కవర్లు, డబ్బాలు దొరుకుతున్నాయి. ఒక్కో చీరను ఒక్కో మస్లిన్‌ క్లాత్‌ కవర్‌లో ఉంచి, వాటిని ఇందులో భద్రపరిస్తే చాలు. లేకపోతే తెలుపు రంగు కాటన్‌ తలగడ కవర్లున్నా వాటిలో భద్రపరుచుకోవచ్చు.

హ్యాంగర్‌కు..
పట్టుచీరలను హ్యాంగర్‌కు వేసినప్పుడు నెలలతరబడి అలాగే ఉంచేయకూడదు. ప్రతి మూడు నెలలకొకసారి తీసి వ్యతిరేకదిశగా మడిచి తిరిగి హ్యాంగర్‌కు వేయాలి. ఇలా చేస్తే చీరలపై శాశ్వతంగా మడతలు ఏర్పడవు. అంతేకాదు, పట్టుచీరను మడిచేటప్పుడు పైట అంచు లోపలకి వచ్చేలా చేయాలి. జరీ అంచుపైకి వచ్చినట్లుగా ఉంటే కొంత కాలానికి జరీ నల్లబడే అవకాశం ఉంది. అలాగే బయటికి వెళ్లి వచ్చిన తర్వాత చీరను నాలుగుమడతలుగా వేసి ఫ్యాన్‌ గాలిలో ఆరనివ్వాలి. మెత్తని వస్త్రంతో చీరంతా మృదువుగా రుద్ది, రెండుమూడు గంటల తర్వాత వార్డ్‌రోబ్‌లో ఉంచితే చాలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్