బిడియాన్ని పక్కకు నెట్టండిలా

వృత్తిగతంగా ఎంత అవగాహన ఉన్నా వేదికపై మాట్లాడమంటే మాత్రం ఉద్యోగినులు వెనకడుగు వేస్తుంటారు. అమ్మో మావల్ల కాదంటూ చేతులెత్తేస్తుంటారు. అన్ని విషయాల్లో పురుషులతో సమానంగా పోటీ పడుతున్నాం.

Published : 04 Aug 2023 00:02 IST

వృత్తిగతంగా ఎంత అవగాహన ఉన్నా వేదికపై మాట్లాడమంటే మాత్రం ఉద్యోగినులు వెనకడుగు వేస్తుంటారు. అమ్మో మావల్ల కాదంటూ చేతులెత్తేస్తుంటారు. అన్ని విషయాల్లో పురుషులతో సమానంగా పోటీ పడుతున్నాం. ఇందులో మాత్రం ఎందుకు వెనకబడాలి. ఒక్కసారి ఇలా ప్రయత్నించి చూడండి..

  • ఏదైనా అంశంపై మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు విషయావగాహన ముఖ్యం. మీరు పనిచేస్తున్న సంస్థ గురించి పూర్తిగా తెలుసుకుంటే ఇది సాధ్యమవుతుంది. ఏదైనా విషయం నిరభ్యంతరంగా చెప్పాలంటే మనకి దానిపై కనీస అవగాహన ఉండటం ముఖ్యం. అప్పుడే ధైర్యంగా మాట్లాడగలం.
  • చాలా మంది వేదికపైకి వెళ్లినప్పుడు అదేపనిగా సబ్జెక్ట్‌పై సమాచారాన్ని ఇచ్చి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంటారు. సమాచారం ఇవ్వడం ఎంత ముఖ్యమో వాళ్లు దాన్ని గ్రహించడమూ అంతే అవసరం. కాబట్టి వాళ్లను ఆకట్టుకోవడానికి మీ సంభాషణకి హాస్యాన్ని జోడించి చూడండి.
  • ఆఖరిగా వెళ్లొచ్చనో, ఎవరో చెబితేనో మాట్లాడవచ్చులే అని వేచిచూడకుండా మీరే ధైర్యంగా మొదట మాట్లాడండి. దీనివల్ల చాలా అంశాలు చెప్పేందుకు అవకాశం దొరుకుతుంది.  మీ సంభాషణ ప్రారంభించే ముందు లేదా ముగించేటప్పుడు తప్పులుంటే సరిదిద్దాల్సిందిగా క్షమాపణలు చెప్పండి చాలు. మంచి వక్తగా గుర్తింపు పొందుతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్