వాళ్ల త్యాగాల గుర్తు... ఆ పార్కు!

పాలకోడేటి శ్యామలాంబ తెలుసా? పోనీ బారు అలివేలమ్మ! గుర్తుపట్టలేదా? మనకే తెలియకపోతే మన తరవాత తరానికి మాత్రం స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న తెలుగు మహిళా సమరయోధుల గురించి ఎలా తెలుస్తుంది?

Updated : 07 Mar 2024 12:48 IST

మహిళా లోకం

పాలకోడేటి శ్యామలాంబ తెలుసా? పోనీ బారు అలివేలమ్మ! గుర్తుపట్టలేదా? మనకే తెలియకపోతే మన తరవాత తరానికి మాత్రం స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న తెలుగు మహిళా సమరయోధుల గురించి ఎలా తెలుస్తుంది? ఆ పరిస్థితి రాకూడదనే రాజమహేంద్రవరంలో మహిళా స్వాతంత్య్ర సమరయోధుల పార్కు ఏర్పాటు చేశారు...

హాత్ముడి వెంట వేలమంది కార్యకర్తలు పాల్గొని నిస్వార్థంగా పోరాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గోదావరి తీరం నుంచి 12మంది మహిళలు గాంధీజీ పిలుపు అందుకుని ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. దుర్గాభాయ్‌ దేశ్‌ముఖ్‌ మొదలుకుని... కాశీభొట్ల వెంకట రమణమ్మ, మద్దూరి వెంకట రమణమ్మ, దువ్వూరి సుబ్బమ్మ, పాలకోడేటి శ్యామలాంబ, బారు అలివేలమ్మ, చేబియ్యం సోదెమ్మ, పెద్దాడ కామేశ్వరమ్మ, గూడూరి నాగరత్నం, గుజ్జు నాగరత్నం, తల్లాప్రగడ విశ్వసుందరమ్మ, శివరాజు సుబ్బమ్మ వంటి వారు ఈ జాబితాలో ఉన్నారు. వీరందరూ ఉప్పు సత్యాగ్రహం, ఖాదీ ఉద్యమం, విదేశీ వస్తుబహిష్కరణ ఉద్యమాల్లో పాల్గొని... జైలు జీవితం అనుభవించారు. వీరందరి గుర్తుగా రాజమహేంద్రవరంలోని కోటిపల్లి బస్టాండ్‌ సమీపంలో ఆనాడు ఉద్యమ ఉపన్యాసాలు జరిగిన స్థలంలోనే పాల్‌చౌక్‌ పేరుతో స్వాతంత్య్ర సమరయోధుల పార్కు నిర్మించారు. ఇక్కడ అడుగుపెడితే అలనాటి పోరాటాలు గుర్తుకొచ్చి మనసు జాతీయతా భావంతో నిండిపోతుంది.

 వై సూర్యకుమారి, రాజమహేంద్రవరం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్