కీళ్లనొప్పులు తగ్గిపోతాయి...

నలభయ్యేళ్లు పైబడ్డ మహిళల్లో కీళ్ల నొప్పులు సాధారణమయ్యాయి. ఇంకాస్త వయసు మీద పడితే మెట్లు ఎక్కలేక అవస్థపడటం చూస్తుంటాం. మరికొందరికి మోకాలి ఆపరేషన్లు కూడా అవసరమవుతున్నాయి. వాటన్నిటినీ నిరోధిస్తుందీ గరుడాసనం! ఇది నిలబడి చేసే ఆసనం. కీళ్లనొప్పులు, జాయింట్స్‌ పట్టేయడం లాంటి ఇబ్బందులను దూరం చేస్తుంది...

Published : 16 Jul 2022 00:19 IST

నలభయ్యేళ్లు పైబడ్డ మహిళల్లో కీళ్ల నొప్పులు సాధారణమయ్యాయి. ఇంకాస్త వయసు మీద పడితే మెట్లు ఎక్కలేక అవస్థపడటం చూస్తుంటాం. మరికొందరికి మోకాలి ఆపరేషన్లు కూడా అవసరమవుతున్నాయి. వాటన్నిటినీ నిరోధిస్తుందీ గరుడాసనం!

ది నిలబడి చేసే ఆసనం. కీళ్లనొప్పులు, జాయింట్స్‌ పట్టేయడం లాంటి ఇబ్బందులను దూరం చేస్తుంది. ముందుగా నిలబడి కుడికాలిని ఎడమ మోకాలి మీది నుంచి మెల్లగా తీసుకుని, ఆ పాదాన్ని ఎడమ కాలి పిక్కల దగ్గర పెట్టి కొద్దిగా కిందికి వంగి ఉండాలి. సరిగ్గా ఇలాగే చేతులతో చేయాలి. కుడి చెయ్యి ముందు పెట్టి.. ఎడమ చేతిని దాని కింది నుంచి కలిపి, ఆనక రెండు చేతులనూ కలపాలి. పిరుదులను కొద్దిగా కిందికి ఉంచాలి. ఒక నిమిషం అలా ఉన్న తర్వాత మెల్లగా యథాస్థితికి వచ్చి రెండో కాలితోనూ అలాగే చేయాలి. అంటే అప్పుడు కుడికాలు తిన్నగా ఉండాలి. ఎడమ కాలు పైనుంచి కుడికాలితో ఆపాలి. రెండు కాళ్లతో రెండు నిమిషాల చొప్పున చేయాలి. ఇలా చేయడం వల్ల కీళ్ల నొప్పులు త్వరగా తగ్గుతాయి. బాగా నొప్పులుంటే గోడను ఆసరాగా చేసుకుని నిలబడి చేయొచ్చు. అలానూ కష్టమనిపిస్తే కుర్చీలో కూర్చుని కూడా చేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్