మామయ్యకు రాసిచ్చారు... ఆస్తి మాకొస్తుందా?
అమ్మమ్మ, తాతయ్యలు బతికి ఉన్నప్పుడు అత్తయ్య వారి బాగోగులు చూడలేదు. ఆ కారణంతోనే.. ఇంటినీ, ఎకరం పొలాన్నీ ముగ్గురు కూతుళ్లకూ చెందేలా వీలునామా రాసి రిజిస్ట్రేషన్ చేయించారు.
అమ్మమ్మ, తాతయ్యలు బతికి ఉన్నప్పుడు అత్తయ్య వారి బాగోగులు చూడలేదు. ఆ కారణంతోనే.. ఇంటినీ, ఎకరం పొలాన్నీ ముగ్గురు కూతుళ్లకూ చెందేలా వీలునామా రాసి రిజిస్ట్రేషన్ చేయించారు. అయితే, ఆ కారణంగా అత్తయ్య, మామయ్య తరచూ గొడవపడుతుండటం చూసి అమ్మావాళ్లంతా మామయ్యకే రాసిచ్చేశారు. వారికి సంతానం లేదు. అయినా ఆవిడలో ఏ మార్పు రాలేదు. వారి తదనంతరం ఆ ఆస్తులపై మాకు హక్కు వస్తుందా? ఎందుకంటే, ఆమె పుట్టింటివారంతా ఇప్పుడు ఆమె పంచన చేరారు? సలహా ఇవ్వగలరు.
ఓ సోదరి.
మీ అమ్మగారు, వారి అక్కలు తమ తండ్రి నుంచి వచ్చిన ఆస్తిని... మీ మామయ్యకు ఎలా రాసిచ్చారు? అంటే...రిజిస్టర్ చేశారా? ఒకవేళ అలా చేసి ఉంటే... అప్పుడు వారు రాసిచ్చిన కాగితం కూడా రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. కేవలం పేపర్ మీదే రాసుకుంటే మాత్రం అది చెల్లదు. హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్-8 ప్రకారం ఎటువంటి వీలునామా లేకుండా చనిపోయిన మగవారి ఆస్తి క్లాస్-1 హెయిర్స్ అంటే భార్యకి, పిల్లలకు చెందుతుంది. ఒకవేళ వారికి పిల్లలు లేకపోతే తల్లికి, భార్యకు సమానంగా చెందుతుంది. సంతానం లేని మీ అత్తయ్య... తన ఆస్తికి ఎటువంటి వీలునామా రాయకుండా చనిపోతే పై చట్టంలోని 15(1) ప్రకారం అది భర్త తరఫున వారసులకు చెందుతుంది. ఒకవేళ ఆవిడకు ఆ ఆస్తి తన తల్లిదండ్రుల నుంచి సంక్రమిస్తే సెక్షన్ 15(2ఎ)ననుసరించి ఆమె తండ్రి వారసులకు చెందుతుంది. అలాకాకుండా మామగారి ఆస్తి అయి ఉండి, భర్త పిల్లలు లేకపోతే అందులోని సెక్షన్15 (2బి) ప్రకారం భర్త వారసులకు చెందుతుంది. మీ మేనమామకి మీ అమ్మగారూ వాళ్లు... గిఫ్ట్ డీడ్ రాసి ఉంటే అందులో రెవోకేషన్ క్లాజ్ పెట్టి ఉంటే... వారికి వెనక్కి తీసుకునే హక్కు ఉంది. వారు బతికి ఉండగానే దాన్ని తిరిగి తీసుకుని ఆ ఆస్తిని కేవలం అనుభవించేలా రాసి రిజిస్ట్రేషన్ చేయిస్తే మంచిది. వాళ్లిద్దరిలో ఎవరు ముందు చనిపోయినా సరే, ఎవరి పేరు మీద రాయకుండా ఉంటే పైన చెప్పినవన్నీ వర్తిస్తాయి. ముందు ఓ మంచి లాయర్ని సంప్రదించండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- ఎండల్లోనూ... తాజాగా
- మంత్రముగ్ధుల్ని చేసేస్తున్నాయి...
- Samantha: పెళ్లి గౌనుని రీసైక్లింగ్ చేయించా.. ఇదంటే ఎంతో ఇష్టం!
- Asoka Makeup Trend: అప్పటి కరీనా లుక్‌ని ఇలా రీక్రియేట్ చేస్తున్నారు!
- ధవళవర్ణంలో దేవకన్యలా..!
ఆరోగ్యమస్తు
- డిప్రెషన్ తగ్గించే పాదాంగుష్ఠాసనం
- ఎలా తింటున్నారు
- పగలు నిద్రపోతున్నారా?
- నెలకు రెండుసార్లు పిరియడ్స్.. ఎందుకిలా?
- వీటితో.. కడుపు చల్లగా.. ఆరోగ్యంగా..!
అనుబంధం
- పాట్లక్తో...
- నాన్నంటే భయపడుతున్నారు..!
- ప్రయోగాలతో నేర్పిద్దామా?
- పెంపకం బట్టి ఎదుగుతారు.!
- బద్ధకపు భర్తతో వేగలేకపోతున్నారా?
యూత్ కార్నర్
- పేదరికాన్ని దాటి... చదువుల్లో మెరిసి!
- Mrunal Thakur: అప్పుడే పెళ్లి చేసుకుంటా.. భవిష్యత్తులో నేనూ దీనికి రడీ!
- టీనాతో ఇంటర్వ్యూకి సిద్ధమా?!
- రాయల్ సొసైటీలో మన స్వెత్లానా!
- వేసవి కథ!
'స్వీట్' హోం
- ఫర్నిచర్‌పై మరకలు పోవాలంటే..!
- ఈ డ్రింక్‌తో వేసవి వేడిని తరిమేయండి!
- రాత్రివేళకి... సుగంధాల రాణి!
- చెత్తబుట్ట నుంచి దుర్వాసన రాకుండా..!
- తేలిగ్గా వండేద్దాం..!
వర్క్ & లైఫ్
- అక్కడ బిడ్డను కంటే రూ. 60 లక్షల బహుమతి!
- థైరాయిడ్‌తో బరువు పెరిగా...
- పట్టు చిక్కాలంటే... ప్రణాళిక ఉండాలి...
- గర్ల్ గ్యాంగ్‌తో వెకేషనా? అందాల ‘బాలి’ వెళ్లాల్సిందే!
- రంగులు తెలిసేలా!