ముఖానికి పూలరేకల మాస్క్‌...

సౌందర్య పోషణకు వంటింటి పదార్థాల్నే కాదు... పూలనూ ఉపయోగించొచ్చు. అదెలాగంటే...

Published : 21 Jun 2021 00:57 IST

సౌందర్య పోషణకు వంటింటి పదార్థాల్నే కాదు... పూలనూ ఉపయోగించొచ్చు. అదెలాగంటే...

మందార : ఈ పువ్వులోని విటమిన్‌ సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రెండు చెంచాల మందార రేకల గుజ్జుకి,  చెంచా కలబంద గుజ్జు, అరచెంచా ముల్తానీ మట్టి, కాస్త రోజ్‌వాటర్‌ కలిపి ముఖం, మెడ, చేతులకు ప్యాక్‌ వేసుకోవాలి. పావుగంటయ్యాక శుభ్రం చేసుకుంటే మోము మెరిసిపోతుంది.

కలువ : కలువ పూలు చర్మానికి అవసరమయ్యే కొలాజిన్‌ను ఉత్పత్తి చేస్తాయి. రెండు చెంచాల కలువ పూల రేకల ముద్దకు చెంచా చొప్పున తేనె, పాలు కలిపి ముఖానికి రాసి అరగంట తర్వాత కడిగేసుకుంటే సరి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే...  ముడతలు, మచ్చలూ తగ్గుతాయి.

గులాబీ : చర్మంపై పేరుకున్న మురికిని గులాబీ దూరం చేస్తుంది. కాస్త గులాబీ రేకల ముద్దకు కాసిన్ని పాలు, చెంచా సెనగపిండి కలిపి ముఖానికి, మెడకు రాయండి. పావుగంట ఆరనిచ్చి కడిగితే చాలు.

మల్లె : ముఖానికి తేమను అందించి మెరిపించే గుణాలు మల్లెలో ఉన్నాయి. గుప్పెడు మల్లెలను పేస్టులా చేసి, అందులో చెంచా కొబ్బరినూనె కలపాలి. దీన్ని ముఖానికి రాసి పావుగంట సేపు మృదువుగా మర్దనా చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చాలు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్