టూ ఇన్‌ వన్‌ స్క్రబ్బర్‌!

గిన్నెలు తోమేటప్పుడు స్టీల్‌ స్క్రబ్బర్‌, కాస్త మృదువైన స్క్రబ్బర్‌ ఉపయోగించడం మనకు అలవాటే! ఈ క్రమంలో పదే పదే వాటిని మార్చాల్సి వస్తుంది. అలాకాకుండా ఈ రెండూ ఒకే దాంట్లో ఇమిడిపోతే..? అలాంటిదే ఈ ‘టూ ఇన్‌ వన్‌ స్క్రబ్బర్‌’.

Published : 20 Nov 2023 12:35 IST

గిన్నెలు తోమేటప్పుడు స్టీల్‌ స్క్రబ్బర్‌, కాస్త మృదువైన స్క్రబ్బర్‌ ఉపయోగించడం మనకు అలవాటే! ఈ క్రమంలో పదే పదే వాటిని మార్చాల్సి వస్తుంది. అలాకాకుండా ఈ రెండూ ఒకే దాంట్లో ఇమిడిపోతే..? అలాంటిదే ఈ ‘టూ ఇన్‌ వన్‌ స్క్రబ్బర్‌’.

ఒకవైపు స్టీల్‌ స్క్రబ్బర్‌, మరోవైపు స్పాంజి లేదా కాస్త మృదువుగా ఉండే స్క్రబ్బర్‌ను జోడించి తయారుచేసిన వీటిని ఉపయోగించడం సులువు. గుండ్రంగా, పొడవుగా, రోలర్‌ షీట్‌లా, స్పాంజి తరహాలో.. ఇలా విభిన్న ఆకృతుల్లో ఇవి లభిస్తున్నాయి. అలాగే సిలికాన్‌తో చేసిన స్క్రబ్బర్‌లోనూ ఒకవైపు బ్రిజిల్స్‌ కాస్త పొడవుగా ఉన్నవి, మరోవైపు బబుల్స్‌లా ఉన్నవి దొరుకుతున్నాయి. ఇక వీటిని ఉపయోగించాక శుభ్రం చేసుకొని ఆరుబయట తగిలించుకునేలా చిన్న హ్యాంగింగ్స్‌ కూడా జత చేసి ఉన్నాయి. మరి, హ్యాండీగా ఉండే అలాంటి స్క్రబ్బర్సే ఇవి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్